17సంవత్సరాల అమ్మాయి.. బ్లూ వేల్ గేమ్ వెనక ఉన్న మాస్టర్ మైండ్.. అరెస్ట్..!

బ్లూ వేల్ గేమ్.. ఇప్పుడు భారతదేశాన్ని వణికిస్తోంది.. కొద్ది రోజుల క్రితం వరకూ విదేశాలకు మాత్రమే పరిమితం అనుకున్నాం… కానీ రోజుకో ప్రాణం భారత్ లో కూడా పోతోంది. ఇప్పటికే ఓ అడ్మిన్ ను రష్యా పోలీసులు అరెస్ట్ చేయగా.. తాజాగా 17 ఏళ్ల అమ్మాయిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ గేమ్ వెనక ఉన్న మాస్టర్ మైండ్ ఆ అమ్మాయేనని పోలీసులు గుర్తించారు.

రష్యా పోలీసులు తూర్పు రష్యాలోని ఓ ఇంట్లో ఈ గేమ్ వెనక ఉన్న మాస్టర్ మైండ్ ఉందని కనుగొన్నారు. ఆ తర్వాత ఆ ఇంట్లో రైడ్ చేసిన పోలీసులు అమ్మాయిని అరెస్ట్ చేశారు. ఆ 17 సంవత్సరాల సైకాలజీ స్టూడెంట్ ఈ గేమ్ కు సంబంధించిన టాస్క్ లు సృష్టిస్తోంది. ఆమెకు మూడు సంవత్సరాల శిక్షను విధించారు. ఈమె కూడా ఆ గేమ్ ను ఆడిందని.. అయితే ఆమె చనిపోకుండా ఉండడంతో అడ్మిన్ గా చేశారని తెలుస్తోంది. ఈమె టీమ్ లో చేరిన తర్వాతనే టాస్కుల్లో ప్రమాదస్థాయి పెరిగిందని చెబుతున్నారు.

బ్లూ వేల్ గేమ్.. మొత్తం 50 రోజుల గేమ్.. ఒక్కో రోజు ఒక్కో టాస్క్ ఇస్తారు. ఒక్కడివే హారర్ సినిమా చూడమని అంటారు.. టెర్రస్ మీద రాత్రంతా గడుపు అని అడుగుతారు. చేతి మీద కత్తితో బ్లూ వేల్ బొమ్మ వేసుకోమని అడుగుతారు. అలా ఒక్కో రోజు ఒక్కో టాస్క్ ఇస్తూ 50వ రోజు ఆత్మహత్య చేసుకోమని అంటారు. ఇలా గేమ్ ఆడుతూ ఇప్పటివరకూ 150 మందికి పైగా ఆత్మహత్య చేసుకున్నారు. ఇల్యా సిదొరోవ్ అనే వ్యక్తిని కూడా మాస్కోలో అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. ఆ గేమ్ కు సంబంధించిన అడ్మిన్ ను ప్రపంచవ్యాప్తంగా ఇంకా చాలామంది ఉన్నారని అంటున్నారు.

About the author

Related

JOIN THE DISCUSSION