రైలు ప‌ట్టాల‌పై.. ఓ నిండు కుటుంబం

ఆంధ్ర‌-క‌ర్ణాట‌క‌-త‌మిళ‌నాడు స‌రిహ‌ద్దుల్లో ఉండే చిన్న గ్రామం అది. దాని పేరు మ‌ల్ల‌నూరు. కుప్పం అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలో ఉంటుంది. ఈ గ్రామానికి ఒక‌వైపు త‌మిళ‌నాడు, ఇంకోవైపు క‌ర్ణాట‌క స‌రిహ‌ద్దులుగా ఉంటాయి.

హ‌ఠాత్తుగా వార్త‌ల్లోకి ఎక్కిందా మ‌ల్ల‌నూరు. కార‌ణం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అనుమానాస్ప‌ద స్థితిలో మ‌ర‌ణించ‌డ‌మే. ఈ ఘ‌టన ఆ గ్రామంలో క‌ల‌క‌లం రేపింది.

ఆ ముగ్గురి మృత‌దేహాలు రైలుప‌ట్టాల‌పై చెల్లాచెదురుగా, మాంస‌పు ముద్ద‌లుగా క‌నిపించ‌డంతో బంధువులు, స్నేహితులు విషాదంలో మునిగిపోయారు.

అన్బ‌ళ‌గ‌న్‌, ఆయ‌న భార్య ల‌క్ష్మి, మూడేళ్ల కుమార్తె జ‌న‌ని రైలు ప‌ట్టాల‌పై మృత‌దేహాలుగా క‌నిపించారు. మ‌ల్ల‌నూరులో అన్బ‌ళ‌గ‌న్ టీ షాప్ న‌డిపేవాడు.

టీ విక్రేత కావ‌డంత అత‌ని షాప్‌కు రోజూ చాలామంది వ‌స్తుంటారు. వారంద‌రూ అత‌నికి స్నేహితులే. అన్బ‌ళ‌గ‌న్ లేడ‌నే విష‌యం తెలుసుకుని వారంద‌రూ దిగ్భ్రాంతికి గుర‌య్యారు.

ప‌ట్టాల వ‌ద్ద‌కు ప‌రుగులు తీశారు. కొంద‌రు పోలీసుల‌కు స‌మాచారం ఇచ్చారు. స‌మాచారం అందుకున్న వెంట‌నే సంఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్న పోలీసులు మృత‌దేహాల‌ను స్వాధీనం చేసుకున్నారు.

అన్బ‌ళ‌గ‌న్‌కు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులూ లేవ‌ని స్థానికులు చెబుతున్నారు. ఈ ఘ‌ట‌న హ‌త్యా? ఆత్మ‌హ‌త్యా అనే కోణంలో ద‌ర్యాప్తు చేస్తామ‌ని పోలీసులు తెలిపారు.  కుప్పం రైల్వేపోలీసులు కేసు న‌మోదు చేసుకున్నారు.

 

About the author

Related

JOIN THE DISCUSSION