బ్రేక్ బదులు ఆక్సలరేటర్ తొక్కిన మహిళ.. ఏడు అంతస్థులపై నుండి బీఎండబ్ల్యూ కారు కింద పడింది..!

ఏడు అంతస్థుల పై నుండి ఓ కారు కింద పడిపోయింది. అయితే అందులో డ్రైవర్ కు ఏమీ కాలేదు.. చిన్న పాటి గాయాలతో డ్రైవింగ్ చేస్తున్న మహిళ ప్రాణాపాయం నుండి తప్పించుకుంది. ఈ ఘటన అమెరికాలోని ఆస్టిన్, టెక్సాస్ లో చోటుచేసుకుంది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ వీడియోలో మొదట ఓ ఎస్యువీ వాహనం పార్కింగ్ ప్లేస్ నుండి బయటకు వస్తుంటుంది. ఇంతలో ముందుకు వెళ్ళాలనుకున్న డ్రైవర్ ఉన్నట్లుండి బ్రేక్ తొక్కుతాడు. ఇంతలో ఆ కారు వెనకాల ఓ బీఎండబ్ల్యూ కారు ఏడు అంతస్థుల పై నుండి కింద పడింది. మొదట తన టైర్ల మీద కింద పడిన కారు బంతిలా బౌన్స్ అయి వెనుతిరిగి పడిపోయింది. వెంటనే అక్కడ ఉన్న వ్యక్తులు ఆ కారును డ్రైవింగ్ చేస్తున్న వారిని రక్షించడానికి ప్రయత్నించారు. ఓ మహిళ కారును డ్రైవింగ్ చేసిందట.. ఏడవ ఫ్లోర్ నుండి కారును కిందకు తెస్తుంటే బ్రేక్ నొక్కడానికి బదులుగా ఆక్సలరేటర్ తొక్కానని ఆ మహిళే ఒప్పుకుంది. ఈ ఘటనలో ఆమె ప్రాణాలతో బయటపడడం విశేషం..!

About the author

Related

JOIN THE DISCUSSION