ప్రాణాలు `జాతీయం`

ప్రాణాలు `జాతీయం`

జాతీయ ర‌హ‌దారులు ప్ర‌యాణికుల ప్రాణాల‌ను జాతీయం చేసేస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల గుండా సాగే జాతీయ ర‌హ‌దారుల‌పై క్ర‌మం త‌ప్ప‌కుండా ప్ర‌మాదాలు చోటు చేసుకుంటున్న‌ప్ప‌టికీ.. వాటిని నివారించంపై ప్ర‌భుత్వాలు దృష్టి పెట్ట‌డం లేదు.

ఒక్క 2016లో 5493 మంది జాతీయ ర‌హ‌దారులపై సంభ‌వించిన ప్ర‌మాదాల్లో మృత్యువాత ప‌డిన‌ట్లు నేష‌న‌ల్ క్రైమ్ రికార్డు బ్యూరో వెల్ల‌డించింది. ప‌దేళ్ల‌లో చోటు చేసుకున్న ప్ర‌మాదాలతో పోల్చుకుంటే- ఇదే అత్య‌ధికం. హైద‌రాబాద్‌ను అనుసంధానించే ఏ జాతీయ ర‌హ‌దారి కూడా దీనికి మిన‌హాయింపు కాదు. హైద‌రాబాద్‌-విజ‌య‌వాడ‌, హైద‌రాబాద్‌-బెంగ‌ళూరు, హైద‌రాబాద్‌-వరంగ‌ల్‌, హైద‌రాబాద్‌-ముంబై.. ఇలా అన్నిచోట్లా రోడ్డు ప్ర‌మాదాలు న‌మోద‌వుతూనే వ‌స్తున్నాయి. ప్ర‌త్యేకించి- అప్రోచ్ రోడ్ల గుండా హైవేపైకి చేరుకునే ప్ర‌దేశాల్లో ప్ర‌మాదాలు న‌మోద‌వుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *