కేసీఆర్ `తెలంగాణ గాంధీ`

ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ను `తెలంగాణ గాంధీ`గా అభివ‌ర్ణించారు ప్ర‌ముఖ న‌టుడు మంచు మ‌నోజ్‌. వచ్చే విద్యా సంవత్సరం నుంచి తెలంగాణలోని అన్ని పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి 12వ తరగతి వరకూ కచ్చితంగా తెలుగు భాషను ఒక సబ్జెక్టుగా బోధించాలంటూ కేసీఆర్‌ విద్యా సంస్థలకు సూచించారు.

తెలుగును ఒక సబ్జెక్టుగా బోధించే పాఠశాలలకు మాత్రమే తెలంగాణలో అనుమతి ఇస్తామని కూడా ఆయ‌న‌ స్పష్టం చేశారు. ఈ విష‌యం తెలుసుకున్న హీరో మంచు మనోజ్.. కేసీఆర్‌ను ఆకాశానికెత్తేశారు. ట్విట్టర్‌లో కామెంట్ చేశారు. `మన మాతృభాష తెలుగును పాఠశాలల్లో తప్పనిసరి సబ్జెక్టుగా బోధించాలని సంకల్పించిన మన తెలంగాణ గాంధీ కేసీఆర్ గారికి నా అభినందనలు..` అంటూ ట్వీట్ మనోజ్ చేశారు.

About the author

Related

JOIN THE DISCUSSION