ఒకే ఒక్క ట్వీట్ తో అమెజాన్ కు 36000 కోట్ల నష్టం.. ఆ ట్వీట్ చేసింది ఎవరు..?

ఒకే ఒక్క ట్వీట్ ప్రముఖ ఈ కామర్స్ వెబ్ సైట్ అమెజాన్ ను నిలువునా ముంచింది. ఒకటి కాదు.. రెండు కాదు.. 36000 కోట్ల రూపాయల నష్టం తెచ్చిపెట్టింది. ఇంతకూ ఆ ట్వీట్ చేసి.. అమెజాన్ ను నష్ట పరిచిన వ్యక్తి ఎవరో తెలుసా..? అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్..!

ట్రంప్ తన ట్విట్టర్ ఖాతాలో ‘పన్ను చెల్లిస్తున్న చిరువ్యాపారులకు అమెజాన్ బాగా నష్టం కలిగిస్తోంది. నగరాలు, పట్టణాలు అనే తేడా లేకుండా అమెరికా అంతటా ప్రజలు బాధపడుతున్నారు. చాలా ఉద్యోగాలు కోల్పొతున్నాం’ అంటూ ట్వీట్ చేశారు. మీడియా రిపోర్టుల ప్రకారం స్టాక్‌ మార్కెట్‌ లో ఆ సంస్థ షేర్లు భారీగా పతనమయ్యాయి. కేవలం రెండు గంటల వ్యవధిలో 1.2 శాతం నష్టాన్ని చవి చూశాయి. దీంతో సుమారు 5.7 బిలియన్ డాలర్ల నష్టం కలిగింది. అమెరికా వ్యాప్తంగా అమెజాన్ సంస్థ దెబ్బకు చాలా మంది వ్యాపారులు తమ స్టోర్ లను మూసి వేస్తున్నారు. అన్ని వస్తువులూ ఆన్ లైన్ లో దొరుకుతుండడం.. అది కూడా చాలా తక్కువ ధరకు దొరుకుతుండడంతో స్టోర్స్ మూసివేతకు కారణం అవుతోంది. అయితే అమెజాన్ మాత్రం ఎప్పటికప్పుడు ఉద్యోగాలను ప్రకటిస్తూనే ఉంది. ఈ సంవత్సరం చివరిలోకెల్లా దాదాపు 100000 కు పైగా ఫుల్ టైమ్ జాబ్స్ ఇవ్వాలని యోచిస్తోంది.

About the author

Related

JOIN THE DISCUSSION