చెత్త ఎయిర్ లైన్స్ లో మనది మూడోది

చెత్త ఎయిర్ లైన్స్ లో మనది మూడోది

భారత విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా ఒక అపప్రధను మూటకట్టుకుంది. ప్రపంచంలోనే అత్యంత చెత్త ఎయిర్ లైన్స్ కంపెనీల్లో ఎయిర్ ఇండియా మూడో స్థానంలో నిలిచి చెత్త రికార్డును సొంతం చేసుకుంది. ఫ్లైట్ స్టాట్స్ అనే ఏవియేష‌న్‌కు చెందిన సంస్థ 2016 ఏడాదికిగాను చేసిన స‌ర్వేలో ఈ విషయం తేలింది.

పొజిషనల్ సర్వీసెస్, ఫ్లైట్ ట్రాకింగ్, రన్ వే టైమ్స్, రాడార్ సర్వీసెస్, ఎయిర్ లైన్ రికార్డ్స్, ఎయిర్ పోర్ట్ డేటా తదితర విషయాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని ఈ ర్యాంకింగ్స్ ఇచ్చినట్టు చెప్పింది. త‌ర‌చూ విమానాలు ఆల‌స్యం కావ‌డం, ర‌ద్ద‌వ‌డం వంటివి ఎక్కువ‌గా ఉన్న ఎయిర్‌లైన్స్‌ను చెత్త ఎయిర్‌లైన్స్‌గా గుర్తిస్తారు. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 500 వర్గాల నుంచి సమాచారం సేకరించి ఈ జాబితా తయారు చేశామని ఫ్లైట్ స్టాట్స్ తెలిపింది. ఇందులో 38.71 శాతంతో ఎయిరిండియా ప్ర‌పంచంలోనే మూడో స్థానంలో నిలిచింది. ఈ సర్వేను ఎయిర్ ఇండియా అధికారి ఒకరు తప్పుబట్టారు. ఇవన్నీ ఎవరికివారు కల్పించుకున్న సర్వేలని కొట్టి పడేశారు. ఎయిర్ ఇండియా కంటే చెత్త ఎయిర్ లైన్స్ గా ఇస్రాయెల్ కి చెందిన ఎల్.. అల్.. ఐస్ లాండ్ కి చెందిన ఐస్ లాండ్ ఎయిర్ పేరు సంపాదించుకున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *