10రోజుల రోమింగ్ కు 1,86,553 రూపాయల బిల్లు.. దుబాయ్ వెళ్ళిన వ్యక్తికి దిమ్మతిరిగిపోయింది..!

ఎయిర్ టెల్ కంపెనీ ఓ వ్యక్తికి గుండె నొప్పి తెప్పించే ప్రయత్నం చేసింది. దుబాయ్ కు వెళ్ళి వచ్చిన వ్యక్తికి ఏకంగా 1,86,553 రూపాయల బిల్లు కట్టమని చెప్పి షాక్ ఇచ్చింది. అయితే అతను ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా బయటపెట్టడమే కాకుండా.. బిల్లు గురించి కంపెనీకి ఫిర్యాదు చేశాడు. అయితే తమ పొరపాటు వలన ఇలాంటి బిల్లు వచ్చిందని.. వేరే బిల్లు ఇస్తామని చెప్పడంతో అతను ఊపిరి పీల్చుకున్నాడు.

న్యూఢిల్లీకి చెందిన నితిన్ సేథీకి ఈ అనుభవం ఎదురైంది. కుటుంబ సభ్యులతో కలిసి దుబాయ్ కి వెళ్ళిన నితిన్ ఎయిర్‌టెల్ నుంచి పది రోజులపాటు అంతర్జాతీయ రోమింగ్ ప్యాక్‌ను యాక్టివేట్ చేసుకున్నాడు. టూర్ ముగించుకుని వచ్చిన అతడికి 1,86,553 రూపాయల బిల్లు రావడంతో షాక్ తిన్నాడు. దీనికి కారణం ఏంటని వాకబు చేస్తే ఇండియాలో అడుగుపెట్టిన తర్వాత కూడా అతడి ప్యాకేజీ డీ యాక్టివేట్ కాలేదు. ఫలితంగా జూన్ 8 నుంచి జూలై 7 వరకు నెల రోజులకు గాను ఏకంగా రూ.1.86 లక్షల బిల్లు వచ్చింది. నితిన్ వెంటనే వినియోగదారుల సేవా కేంద్రానికి ఫిర్యాదు చేయగా, సాంకేతిక కారణాల వల్లే బిల్లు తప్పుగా జనరేట్ అయిందని వివరణ ఇచ్చారు. మరో బిల్లు పంపిస్తామని చెప్పడంతో అతని మనసు కుదుటపడింది. అప్పటికే ఈ వార్త సోషల్ మీడియాలో దావానంలా వ్యాపించింది. ఇప్పటికే జియో దెబ్బకు కుడురుకోలేకపోతున్న ఎయిర్ టెల్ ఇలా లక్షల బిల్లు కట్టమని అడుగుతోందని అందరూ తెగ షేర్లు చేస్తున్నారు.

 

About the author

Related

JOIN THE DISCUSSION