సైన్స్ అద్భుతాల ఆవిష్కారానికి ఇంకొన్ని గంట‌లే!

సైన్స్ అద్భుతాల ఆవిష్కారానికి ఇంకొన్ని గంట‌లే!

మ‌రి కొన్ని గంటలు. సైన్స్ లో అద్భుతాలు ఆవిష్కృతం కానున్నాయి. సైన్స్‌లో మ‌న‌దేశం స‌త్తా ఏంటో, సాధించిన చారిత్రాత్మ‌క విజ‌యాలేంటో.. చాటి చెప్పే ఇండియ‌న్ సైన్స్ కాంగ్రెస్ ఆరంభం కానుంది. ఒక‌రు కాదు.. ఇద్ద‌రు కాదు.. సైన్స్‌లో నోబెల్ బ‌హుమ‌తిని అందుకున్న ఆరుగురు శాస్త్ర‌వేత్త‌లు దీనికి హాజ‌రు కానున్నారు.

ఇంత‌టి ప్ర‌తిష్ఠాత్మ‌క సైన్స్ కాంగ్రెస్‌కు తిరుప‌తి వేదిక కావ‌డం మ‌న‌కు గ‌ర్వ‌కార‌ణం. ఈ స‌మావేశాల‌ను తిరుప‌తిలో నిర్వ‌హించ‌డం ఇది రెండోసారి. 1973లో మొదటిసారిగా దీన్ని తిరుప‌తిలో ఏర్పాటు చేశారు. శ్రీ‌వేంక‌టేశ్వ‌ర విశ్వ‌విద్యాల‌యం స్టేడియంలో ఏర్పాటైన ఈ కాంగ్రెస్‌ను ప్ర‌ధానమంత్రి న‌రేంద్ర‌మోడీ దీన్ని ప్రారంభించ‌నున్నారు. అయిదు రోజుల పాటు ఈ స‌మావేశాలు కొన‌సాగుతాయి. గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి చంద్రబాబు తో పాటు వివిధ దేశాలకు చెందిన ఆరుగురు నోబెల్‌బహుమతి గ్రహీతలు హాజరుకానున్నారు. వారి తో పాటు 11 వేల మంది అతిథులు హాజరు కానున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *