అల్లాహ్ వాలా మేకను 1,00,00,786 రూపాయలకు అమ్మాలని తీసుకొని వచ్చారు.. కానీ..!

సాధారణంగా మేకల శరీరంపై అల్లా అని ఉన్న వాటికి ధర చాలా ఎక్కువగా ఉంటుంది. కొందరు కోటి రూపాయలు పెట్టి కూడా కొన్న రోజులు ఉన్నాయి. అదే ఆశతో అజ్మీర్ నుండి సొహైల్ అనే వ్యక్తి ‘అల్లా వాలా బకరా’ మేకను ముంబై మార్కెట్ కు తీసుకొని వచ్చాడు. దాని ధరను ఒక కోటి ఏడువందల ఎనభై ఆరు రూపాయలుగా నిర్ణయించాడు. అయితే ఒక్కరు కూడా కొనడానికి రాకపోవడంతో నిరాశతో వెనుదిరిగాడు. ఒకానొక దశలో అతను సగానికి సగం ధరను తగ్గిస్తానని చెప్పాడు 51,00,786రూపాయలకు ఇచ్చేస్తానని చెప్పాడు. కానీ ఆ డబ్బుకు కూడా కొనడానికి ఏ ఒక్కరు కూడా ముందుకు రాలేదు.

దాదాపు కొన్ని వేల మంది జనాలు ఈ మేక ధర కనుక్కోడానికి అతని వద్దకు వచ్చారు. కానీ ఏ ఒక్కరు కూడా కొనుక్కోడానికి ఆసక్తి చూపలేదు. ఇక ఎంతకూ తెగదని భావించిన వాళ్ళు ఇంటికి వెనుదిరిగారు. వచ్చే సంవత్సరం మళ్ళీ వస్తామని చెప్పారు. మేక‌ మెడ భాగంలో అరబ్ లో ‘అల్లా` చిహ్నాన్ని పోలిన గుర్తులు ఉన్నాయి. దీంతో వారు ఆ మేక ధ‌ర‌ను కోటి ఏడువందల ఎనభై ఆరు రూపాయలుగా నిర్ణ‌యించారు. అలాగే చెవి దగ్గర నెలవంక కూడా ఉందట..!

 

About the author

Related

JOIN THE DISCUSSION