కారే కాదు.. ఫోన్ కూడా కొనలేము.. 1.57 లక్షలే..!

లంబోర్గిని.. ఆ కంపెనీకి చెందిన బేసిక్ కారు కొనాలన్నా కోట్లు కుమ్మరించాల్సిందే. చాలామంది ఎప్పటికైనా ఆ కారును కొనాలన్న లక్ష్యంతో ఉంటారు. అందుకే ఎక్కువగా పోస్టర్ల లోనే వాటిని చూస్తూ ఉంటాము. అయితే ఆ కంపెనీ తాజాగా ఓ లిమిటెడ్ ఎడిషన్ స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసింది. లంబోర్గిని ఆల్ఫా అన్ పేరుతో ఓ స్మార్ట్ ఫోన్ ను రెడీ చేసింది ఈ ఇటాలియన్ కార్ కంపెనీ.. దీని ధర వింటే మనకు చుక్కలు కనిపిస్తాయి. ఎందుకంటే ఈ ఫోన్ ధర 1.57 లక్షల రూపాయలు మాత్రమే..!

లిమిటెడ్ ఎడిషన్ ఫోన్లు అంటే.. ఏదో పైకి పటారం లోన లొటారం లాగా ఇది కూడా అలాగే ఉంటుందని అనుకోకూడదు. ఎందుకంటే ఇది ఇప్పటి ఆండ్రాయిడ్ ఫోన్ లోని ఫీచర్స్ ఎలా ఉన్నాయో అన్నీ ఇందులో ఉన్నాయి. 4జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ మెమొరీ.. కావాలని అనుకుంటే 128 జీబీ వరకూ పెంచుకోవచ్చు. బ్యాటరీ బ్యాకప్ కూడా బాగానే ఉంటుంది.. ఎందుకంటే 3250 ఎంఏహెచ్ బ్యాటరీ ఇందులో ఉంటుంది. ఇక 5.5 ఇంచెస్ డిస్ప్లే కూడా ఉంటుంది. 20 మెగా పిక్సెల్స్ బ్యాక్ కెమెరా కాగా.. 8 మెగా పిక్సెల్స్ ఫ్రంట్ కెమెరా ఇందులో కలదు. ఇక ఆండ్రాయిడ్ నౌగాట్ ఆపరేషన్ సిస్టంతో ఇది పనిచేస్తుంది. ప్రస్తుతం అమెరికా.. యుకే ప్రజలకు ఈ ఫోన్ అందుబాటులో ఉంది.. కావాలనుకుంటే ఆన్ లైన్ లో కూడా కొనొచ్చు.

 

About the author

Related

JOIN THE DISCUSSION