గాయపడ్డ బిగ్ బి.. మరో ‘కూలీ’ ఘటన

అమితాబ్ బచ్చన్ జీవితంలో కూలీ సినిమా ఓ మరపురాని చిత్రం..! ఆయన కెరీర్ లో అది బిగ్గెస్ట్ హిట్ చిత్రాల్లో ఒకటైనప్పటికీ.. ఆయన్ను చావు అంచులకు తీసుకెళ్ళిన చిత్రమది. ఓ సీన్ షూటింగ్ లో భాగంగా ఆయన తీవ్రంగా గాయపడ్డారు. 1982, జూలై 26న బెంగళూరులో ఈ చిత్రం షూటింగ్ చేస్తుండగా బిగ్ బీ గాయపడ్డాడు. ఆగస్ట్ 1వ తేదీ వరకూ ఆయన బ్రతుకుతాడో లేదో తెలీలేదు. దేశం మొత్తం ఆయన బ్రతకాలని కోరుకుంది. ఆగస్ట్ రెండున ఆయనకు పునర్జన్మ అని దేశ ప్రజలే కాదు.. బిగ్ బీ కూడా చెప్పుకునేవాడు.

తాజాగా మరోసారి అమితాబ్ గాయపడ్డారు. ప్రస్తుతం ఆయన థగ్స్ ఆఫ్ హిందోస్తాన్ అనే సినిమా చేస్తున్నారు. ఆమిర్ ఖాన్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో అమితాబ్ కూడా నటిస్తున్నారు. తాజా గాయం పెద్దదే అన్న వార్తలు వస్తున్నాయి. గాయం కారణంగా విపరీతమైన నొప్పిని అమితాబ్ అనుభవించారని తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ఆయనకు పక్కటెముకలు విరిగినట్లుగా తెలుస్తోంది. ప్రమాదం జరిగిన తర్వాత కూడా బిగ్ బి తన షూటింగ్ ను కొనసాగించినట్లుగా చెబుతున్నారు. షూటింగ్ ముగించుకు వచ్చిన తర్వాత ముంబయికి చేరుకున్న బిగ్ బి.. వైద్యుల సూచనతో స్కానింగ్ చేయించుకున్నారని పక్కటెముకల్లో చీలిక చోటు చేసుకున్నట్లుగా చెబుతున్నారు. ధూమ్ 3 చిత్ర దర్శకుడు విజయ్ కృష్ణ ఆచార్య ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. భారతదేశంలో సముద్రపు దొంగలు ఎలా ఉండేవారన్న విషయాన్ని ఈ చిత్రంలో ప్రత్యేకంగా చూపించనున్నారు. 2018 దీపావళికి ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. బాహుబలి రేంజిలో ఈ చిత్రం ఉండబోతోందట..!

About the author

Related

JOIN THE DISCUSSION