త‌న కాన్వాయ్‌ను ఆపేసి..108కు దారి ఇచ్చిన వైఎస్ జ‌గ‌న్‌

ఎవ‌రైనా ప్ర‌మాదానికి గురైతే.. వెంట‌నే గుర్తుకొచ్చేది 108 అంబులెన్స్‌. దివంగ‌త ముఖ్య‌మంత్రి డాక్ట‌ర్ వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి మాన‌స పుత్రిక అది. ఆయ‌న హ‌యాంలో ఎంతోమంది ప్రాణాల‌ను నిల‌బెట్టిన వాహ‌నం అది.

ఇప్పుడు దాని ప‌రిస్థితి ఎలా ఉంద‌నేది ప్ర‌త్యేకించి చెప్పుకొన‌క్క‌ర్లేదు గానీ.. ఆ వాహ‌నానికి ప్ర‌తిప‌క్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఎంత‌టి ప్రాధాన్య‌త ఇస్తున్నారో తెలియ‌జెప్పే స‌న్నివేశం అది.

నంద్యాల ఉప ఎన్నిక‌లో ప్రచారంలో భాగంగా.. వైఎస్ జ‌గ‌న్ చింత‌కుంట గ్రామంలో రోడ్‌షో నిర్వ‌హిస్తుండ‌గా.. కుయ్ కుయ్ మ‌నే శ‌బ్దం చేస్తూ అటుగా వ‌చ్చింది 108 అంబులెన్స్‌. వెంట‌నే అప్ర‌మ‌త్తం అయ్యారు వైఎస్ జ‌గ‌న్‌. త‌న వాహ‌న శ్రేణిని రోడ్డుప‌క్క‌న ఆపేశారు.

అంబులెన్స్‌కు దారి ఇవ్వాల్సిందిగా పార్టీ కార్య‌క‌ర్త‌లు, పోలీసుల‌ను సూచించారు. క్ష‌ణాల‌ వ్య‌వ‌ధిలోనే ఆ అంబులెన్స్ అక్క‌డి నుంచి వెళ్లి పోయింది. అంబులెన్స్‌ను అడ్డుకున్న ముఖ్య‌మంత్రులను చూశాం. అంబులెన్స్ డ్రైవ‌ర్ల‌తో గొడ‌వ ప‌డ్డ రాజ‌కీయ పార్టీ కార్య‌క‌ర్త‌ల‌నూ చూశాం. వారంద‌రికంటే భిన్నంగా వ్య‌వ‌హ‌రించారు జ‌గ‌న్‌.

వీడియో:

About the author

Related

JOIN THE DISCUSSION