ఆపిల్ కొత్త కార్యాల‌యంలో ఏముంది..

ఆపిల్ కొత్త కార్యాల‌యంలో ఏముంది..

ఐదు బిలియ‌న్ డాల‌ర్ల‌తో నిర్మించిన ఆపిల్ ప్రధాన కార్యాల‌య రెండో ప్రాంగ‌ణం ఇప్పుడు ప్ర‌పంచాన్ని విశేషంగా ఆక‌ర్షిస్తోంది. అందులో ఏముందీ, ఎలాగుంటుంద‌ని ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ ఏడాది ప్ర‌ధ‌మార్థంలో కార్యాల‌యాన్ని ప్రారంభిస్తార‌ని ప్ర‌ముఖ మ‌ల్టీమీడియా సంస్థ మాష‌బుల్ తెలిపింది. ప్ర‌ధానం భ‌వంతి ఉంగరం ఆకారంలో ఉంటుంది. నాలుగంతస్థులుగా నిర్మించిన ఈ భ‌వంతి చూసేందుకు స్పేస్‌షిప్‌లా క‌నిపిస్తుంది.

 

176 ఎక‌రాల‌లో దీన్ని నిర్మించారు. వంద సాక‌ర్ మైదానాల‌కు స‌మాన‌మ‌న్న‌మాట‌. పెంట‌గాన్‌లోని ఎంపైర్ స్టేట్ భ‌వంతి కంటే దీని ప్ర‌ధానం కార్యాల‌యం 1500 అడుగుల పొడ‌వు ఎక్కువ‌. మూస‌పోసిన 3000 గాజు రేకులను భ‌వంతిపై గుండ్రంగా ఏర్పాటు చేశారు. సౌర‌శ‌క్తి, జీవ శ‌క్తినుప‌యోగించి త‌యారుచేసిన విద్యుత్తును ఈ భ‌వంతిలో వినియోగిస్తారు. మొత్తం విస్తీర్ణంలో 80శాతం హ‌రిత వ‌నాలే. జాగింగ్‌, సైక్లింగ్‌కూ ట్రాక్స్ నిర్మించారు. 13వేల మంది ఉద్యోగుల కొత్త ప్ర‌ధాన కార్యాల‌యంలో విధులు నిర్వ‌ర్తిస్తారు. ఏడు కేఫ్‌ల‌ను ఏర్పాటుచేశారు. వెయ్యివ‌ర‌కూ సైకిళ్ళు సిద్ధంగా ఉంటాయి. వీటినుప‌యోగించి వారు ఆవ‌ర‌ణ‌లో తిర‌గ‌వ‌చ్చు. ఆవ‌ర‌ణ‌లో మొత్తం 7000 వృక్షాలున్నాయి. వెయ్యిమంది కూర్చునే అవ‌కాశ‌మున్న ఆడిటోరియం, ల‌క్ష చ‌ద‌ర‌పు అడుగుల విస్తీర్ణంలో ఫిట్‌నెస్ సెంట‌ర్‌, 3ల‌క్ష‌ల చ‌ద‌ర‌పు అడుగుల‌లో ప‌రిశోధ‌న, అభివృద్ధి కార్య‌క‌లాపాల కేంద్రాన్నీ ఏర్పాటుచేశారు. మొత్తం 14వేల వాహ‌నాల‌ను నిలుపుకోవ‌డానికి వీలుగా రెండంచెల పార్కింగ్ గ్యారేజీలున్నాయి. ఇక్క‌డి నుంచే సంద‌ర్శ‌కుడు ప్రాంగ‌ణం మొత్తాన్నీ చూడ‌వ‌చ్చు. జ‌న‌వ‌రి 2016లో ఆపిల్ న‌గ‌దు నిల్వ 215 బిలియ‌న్ డాల‌ర్ల‌లో రెండు శాతం అంటే 5 బిలియ‌న్ డాల‌ర్ల‌ను ప్ర‌ధాన కార్యాల‌య రెండో క్యాంప‌స్ నిర్మాణానికి ఖ‌ర్చ‌య్యింద‌ట‌. ప్ర‌పంచంలోనే ఐదో ఖ‌రీదైన భ‌వంతిగానూ, అత్యంత చ‌ల్లగా ఉండే ప్రాంతంగానూ ఇది రూపొందింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *