పెట్టిన పెట్టుబడి కంటే ఎనిమిది రెట్లు.. టాప్ టెన్ లో అర్జున్ రెడ్డి.. అందరికీ పార్టీ ఇచ్చాడట..!

తక్కువ బడ్జెట్ లో నిర్మించిన సినిమా.. కలెక్షన్ల పరంగా టాప్ 10 లో నిలిచింది. పెద్ద పెద్ద సినిమాలు కూడా అందుకోలేని రికార్డులను అందుకుంటోంది. అదేనండి అర్జున్ రెడ్డి సినిమా గురించి చెబుతున్నాము.. ఓవర్సీస్ లో ప్రీమియం షో దగ్గర నుండి అర్జున్ రెడ్డి అరుపులే అరుపులు అసలు.. ఓవర్సీస్ లో ఏకంగా 1.68 మిలియన్ డాలర్లను వసూలు చేసింది. ఓవర్సీస్ లో ఇంతవరకూ అత్యధిక వసూళ్లను సాధించిన టాప్ టెన్ తెలుగు చిత్రాల్లో అర్జున్ రెడ్డి స్థానాన్ని సంపాదించుకుంది. ‘శాతకర్ణి’ లైఫ్ టైమ్ వసూళ్లు 1.66 మిలియన్ డాలర్లను అర్జున్ రెడ్డి దాటేశాడు.

ఇక 6 కోట్లకు థ్రియేటికల్ రైట్స్ అమ్ముడుపోగా సినిమా మొత్తం 41.4 కోట్ల గ్రాస్ ను అందించి 22.6 షేర్స్ ని అంధించింది. పెట్టిన పెట్టుబడి కంటే ఈ సినిమా ఎనిమిది రేట్లు ఎక్కువ కలెక్షన్స్ ను రాబట్టింది. చిత్ర యూనిట్ కి హీరో విజయ్ దేవరకొండ మంచి పార్టీని ఇచ్చాడట. శనివారం ఒక స్టార్ పబ్ లో సినిమా విజయంలో కీలక పాత్ర పోషించిన ప్రతి ఒక్కరిని ఆహ్వానించి విజయ్ హ్యాపీ గా సెలబ్రెట్ చేసుకున్నాడట.

About the author

Related

JOIN THE DISCUSSION