బెంగళూరులో సాగరకన్య.. ఓ వ్యక్తి తీసుకొని వచ్చాడు..!

ఐటీ సిటీ బెంగళూరులో ఓ సాగరకన్య కనిపించింది. బెంగళూరులో సముద్రం ఎక్కడ ఉంది సాగరకన్య రావడానికి అనుకుంటున్నారేమో.. పోనీలే జలకన్య వచ్చిందని అనుకోండి. అయితే ఈ జలకన్య ఏ వర్షాలకో కొట్టుకొని రాలేదు. బెంగళూరు రోడ్ల మీద ఉన్న గుంతలో కనిపించింది. బెంగళూరు రోడ్ల మీద తక్కువలో తక్కువ అనుకుంటే 16000 గుంతలు ఉన్నాయట. వాటి వలన ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతున్నారని భావించిన బాదల్ నంజుండస్వామి అనే ఆర్టిస్ట్ శుక్రవారం రోజున సాగరకన్యను తీసుకొని వచ్చారు.

క‌న్న‌డ న‌టి సోను గౌడ సాగ‌ర క‌న్య‌లాగ దుస్తులు ధ‌రించి న‌డిరోడ్డు మీద గుంత‌ల్లో రంగు నీళ్లు పోసి ఇలా నిర‌స‌న తెలియ‌జేశారు. వీరు చేస్తున్న పనికి బెంగ‌ళూరు ప్ర‌జ‌లు మ‌ద్ద‌తుగా నిలుస్తున్నారు. గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాల వలన బెంగళూరు రోడ్లు విపరీతంగా పాడయ్యాయి. ఎంతో మంది ఈ రోడ్ల వలన ఇబ్బందులు పడుతున్నారు. బాదల్ నంజుండస్వామి ముందు నుండి బెంగళూరు లోని రోడ్ల దుస్థితిపై తనదైన శైలిలో నిరసన తెలియజేస్తున్నాడు. రెండు సంవత్సరాల క్రితం ఆయన బెంగళూరు రోడ్ల మీద మొసలినే తన ఆర్ట్ తో తీసుకొని వచ్చారు. అప్పుడు ఆ ఘటన దేశ వ్యాప్తంగా వైరల్ అయింది.

About the author

Related

JOIN THE DISCUSSION