కోటీశ్వరుడికి మనవరాలు.. పాన్ మసాలా ప్యాకెట్లు వేసుకొని గుడి ముందు అడుక్కుంటోంది..!

ఆమె భారతదేశంలోనే పేరెన్నికగన్న కోటీశ్వరుడి మనవరాలు.. పాన్ మసాలాలు ఒంటి మీద వేసుకొని ఓ చేతిలో గిన్నె పట్టుకొని ఓ గుడి ముందు అడుక్కుంటోంది. ఇంతకూ ఆ గుడి ముందే ఆమె ఎందుకు అడుక్కుంటుందో తెలుసా..? అది కూడా ఆమె తాతదేనట..!

కాన్పూర్ లో ఓ అమ్మాయి జీన్స్ ధరించి అడుక్కోవడం మొదలుపెట్టింది. ఆమె తన ఒంటి మీద ‘గ్రాండ్ డాటర్ ఆఫ్ దిల్బాగ్ పాన్ మసాలా ఈజ్ బెగ్గింగ్’ అని ఓ పోస్టర్ ను తగిలిచుకుంది. ఆ అమ్మాయి పేరు కాజల్ అరోరా.. ఫేమస్ పాన్ మసాలా ఓనర్ దిల్బాగ్ అరోరా కు మనవరాలు. అతని కొడుకు అరుణ్ ఆరోరా కాజల్ కు తండ్రి.. కాబట్టి దిల్బాగ్ పాన్ మసాలా కంపెనీకి ఆమె కూడా వారసురాలే..!

ఇంతకూ ఆమె ఇలా అడుక్కోడానికి కారణమేమిటంటే.. అరుణ్ అరోరా కొన్ని సంవత్సరాల క్రితం ఆమె తల్లిని పెళ్ళి చేసుకున్నాడట.. అప్పటికే అరుణ్ అరోరా ఓ మహిళను పెళ్ళి చేసుకుని విడాకులు ఇచ్చిన తర్వాత కాజల్ తల్లి రీతు అరోరా ను 1993 లో పెళ్ళి చేసుకున్నాడు. 1996 లో రీతుకు కూడా డైవర్స్ ఇచ్చేశాడు. అప్పటికే ఆమె కడుపులో కాజల్ పెరుగుతోంది. తాను సన్యాసం తీసుకోవాలని అనుకున్నానని అందుకోసమే నీకు విడాకులు ఇస్తున్నానని రీతుకు చెప్పి విడాకులు తీసుకున్నాడు అరుణ్ అరోరా. అయితే ఆ తర్వాత కూడా అరుణ్ అరోరా రెండు పెళ్ళిళ్ళు చేసుకున్నాడు. వారిద్దరికీ కూడా విడాకులు ఇచ్చేశాడు. అయిదో సారి పెళ్ళి చేసుకోడానికి అరుణ్ అరోరా సిద్ధమవుతున్న తరుణంలో కాజల్ అరోరా ఇలా రోడ్డు ఎక్కింది. తాను అరుణ్ అరోరా కూతురునని.. దిల్బాగ్ పాన్ మసాలా కంపెనీకి తానే వారసురాలని చెప్పింది. తనకు వారసత్వంగా రావాల్సిన వాటిని తనకు ఇవ్వాలని కాజల్ కోరింది. అందుకే తన తాతలు కట్టించిన ప్రాంతాల్లో అడుక్కుంటోంది. కాజల్ ప్రస్తుతం బిఎస్సీ సెకండ్ ఇయర్ చదువుతోంది. సాకేత్ నగర్ లో ఆమె తన తల్లితో కలసి నివసిస్తోంది. అయితే నాలుగు పెళ్ళిళ్ళు చేసుకున్న అరుణ్ అరోరాకు ఇప్పటివరకూ మగ సంతానం అన్నది లేదు.

About the author

Related

JOIN THE DISCUSSION