రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్ లపై సెటైర్ వేసిన బజాజ్.. నెటిజన్లు ఏమంటున్నారంటే..!

రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్స్.. టీవీలో యాడ్స్ ఉండవు, పేపర్లలో ప్రకటనలు ఉండవు.. అయినా కానీ భారతదేశంలో ఏ మాత్రం డిమాండ్ తగ్గదు. ఒక బైక్ కస్టమర్ దగ్గరకు చేరాలంటే కనీసం రెండు నెలలు అయినా పడుతుంది. ఇక బ్రాండ్ ఇమేజ్ అంటారా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. లాంగ్ రైడ్ లకు వెళ్ళాలంటే దీన్నే మొదటి ఆప్షన్ గా ఎన్నుకుంటారు. అయితే ఇటీవల బజాజ్ కంపెనీ తయారు చేసిన ఓ యాడ్.. రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్ లను కించ పరిచే విధంగా ఉంది. అది కూడా ఏదో విమర్శనాత్మకంగా చెప్పింటే పర్లేదు.. డైరెక్ట్ గా చెప్పేసింది..!

కొందరు వ్యక్తులు నిదానంగా ఏనుగుల మీద వెళుతుంటారు.. బ్యాగ్రౌండ్ లో బుల్లెట్ బైక్స్ సౌండ్ వస్తూ ఉంటుంది.. అప్పుడు ఆ ఏనుగులు ఓ ఎత్తైన ప్రదేశాన్ని ఎక్కడానికి ప్రయత్నిస్తుండగా బజాజ్ కంపెనీకి చెందిన ‘డోమినార్ 400’ బైక్ దూసుకుంటూ వస్తుంది. ఏనుగుల మధ్య లో నుండి చాకచక్యంగా బయటకు వెళ్ళిపోతుంది. ఏనుగును పోషించకండి.. డోమినార్ బైక్ తో హైపర్ రైడింగ్ కు వెళ్ళండి అంటూ ఆ యాడ్ ముగుస్తుంది. ఏనుగుల మీద ఉన్న హెల్మెట్లు.. వారు ధరించిన జాకెట్లు.. బ్యాగ్రౌండ్ లో వచ్చే సౌండ్ మొత్తం రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్ లను ఉద్దేశించి ఈ యాడ్ ను తయారు చేశారని అందరూ అంటున్నారు. ఏది ఏమైనా ఇలా డైరెక్ట్ గా ఓ యాడ్ ను చేయడం మార్కెటింగ్ ఫీల్డ్ లో పెద్ద సాహసమే..!

అయితే దీనిపై రాయల్ ఎన్ ఫీల్డ్ వాహనాన్ని వాడుతున్న వ్యక్తులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. మీ బైక్ అమ్ముడు పోక పోతే మిగతా వాళ్ళ బైక్ ల మీద పడి ఏడుస్తున్నారని బజాజ్ కంపెనీని కడిగేస్తున్నారు నెటిజన్లు. తాము ఏనుగులు అయితే మీరు కుక్కలు అని మరో రాయల్ ఎన్ ఫీల్డ్ యూజర్ కామెంట్ చేశాడు. రాయల్ ఎన్ ఫీల్డ్ ను మద్య లోకి ఎందుకు లాగుతున్నారు.. ఆ కంపెనీ బైక్ లు మీ బైక్ లకు ముత్తాతలు, నాన్నల లాంటివని అంటున్నారు.

About the author

Related

JOIN THE DISCUSSION