ట్రైనీ అంపైరా?

క్రికెట్‌లో ఇదో స‌ర‌దా స‌న్నివేశం. అంపైర్‌ను అనుక‌రిస్తూ బౌల‌ర్ కూడా అవుట్ అంటూ వేలు పైకెత్తిన దృశ్యం అది. బంగ్లాదేశ్‌, ఆస్ట్రేలియా జ‌ట్ల మ‌ధ్య జ‌రుగుతున్న టెస్ట్ మ్యాచ్‌లో ప్రేక్ష‌కుల‌ను ఆక‌ర్షించిన ఘ‌ట్టం. ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్ మ‌ధ్య రెండో టెస్టు మూడో రోజు ఆట‌లో బౌల‌ర్ మెహిదీ హ‌స‌న్ మిరాజ్‌ బౌలింగ్‌లో ఆసీస్ బ్యాట్స్‌మెన్ పాట్ క‌మ్మిన్స్ ఎల్‌బీడ‌బ్ల్యూ అయ్యాడు.

మొద‌ట అంపైర్ నిజెల్‌లాంగ్ అవుట్ ఇవ్వ‌లేదు. దీనితో బంగ్లా క్రికెట‌ర్లు థ‌ర్డ్ అంపైర్ రివ్యూకు వెళ్లారు. థ‌ర్డ్ అంపైర్ రివ్యూలో క‌మిన్స్ అవుటైన‌ట్టు తేలింది. దీనితో అంపైర్ త‌న రివ్యూను వెన‌క్కి తీసుకుంటూ- క‌మిన్స్ అవుటైన‌ట్టు ప్ర‌క‌టించాడు. ఈ స‌మ‌యంలో నాజిర్ హొస్సేన్ అంపైర్ ప‌క్క‌నే నిల్చుని.. ఆయ‌నను అనుస‌రించాడు. ఈ వీడియో కాస్త సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌లా మారింది. ఈ టెస్టులో ఆస్ట్రేలియా ఘ‌న విజ‌యం సాధించింది.

About the author

Related

JOIN THE DISCUSSION