మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారన్నదానికి ఈ వీడియో ఒక ఉదాహరణ.. క్షణాల్లో నాలుగు లక్షలు కొట్టేశారు..!

దొంగతనాలు మరీ అంత వీజీనా అనేంతగా అనిపిస్తోంది ఈ దొంగతనం. ఇద్దరు అమ్మాయిలు కొన్ని నిమిషాలలో నాలుగు లక్షల రూపాయలు దొంగిలించి వెళ్ళిపోయారు. ఈ ఘటన పంజాబ్ రాష్ట్రం లూథియానా లోని ఓ బ్యాంకులో చోటుచేసుకుంది.

అందమైన అమ్మాయి బైకులో వచ్చింది. బ్యాంకు లోపలి ప్రవేశించి ఓ కష్టమర్ పక్కకు వెళ్ళి నిలబడింది. అతను కొన్ని నిమిషాల్లో డబ్బులు కట్టేసేవాడే.. కానీ ఆ అమ్మాయి పక్కన నిలబడి బ్లేడుతో అతని బ్యాగును కోసేసింది. ఆమె వెనకాలే ఉన్న మరో అమ్మాయికి సైగ చేసి ఇద్దరూ కలసి ఉడాయించారు. ఆమె వెళ్ళిన తర్వాత బ్యాగు తేలిగ్గా ఉందని గమనించిన ఆ వ్యక్తి బ్యాగును చెక్ చేయగా మోసపోయానని గమనించాడు. ఈ ఘటన మొత్తం సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యింది. సెప్టెంబర్ 7 వ తేదీ ఉదయం 11:30గంటలకు ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు ఆ మహిళలను వెతికే పనిలో పడ్డారు. మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారన్నదానికి ఈ వీడియో ఒక ఉదాహరణ.

About the author

Related

JOIN THE DISCUSSION