ఈ నెల 22న బ్యాంకులు బంద్..!

ఆగస్ట్ 22న ప్రభుత్వరంగ బ్యాంకు సేవలు బంద్ కానున్నాయి. ఉద్యోగ సంఘాలు తమ డిమాండ్ల సాధనకు మంగళవారం దేశవ్యాప్తంగా సమ్మె తలపెట్టాయి. ప్రభుత్వరంగ బ్యాంకుల విలీనాలను వీరు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఉద్యోగ సంఘాలు ప్రభుత్వంతో చర్చలు జరిపినప్పటికీ ఫలితం లేకపోయింది. బ్యాంకు సంఘాల డిమాండ్లకు కేంద్రం సానుకూలంగా స్పందించకపోవడంతో సమ్మె అనివార్యమైంది. ప్రభుత్వ తీరుకు నిరసనగా ఆగస్ట్ 22వ తేదీన సమ్మె చేయాలని సంకల్పించారు. ఈ కారణంగా సాధారణ బ్యాంకు సేవలకు తీవ్ర అంతరాయం కలగనుంది.

కార్పొరేట్ కంపెనీలకు ఇచ్చిన రుణాలను మొండి బకాయిలుగా పరిగణించి రద్దు చేయాల్సిన అవసరం లేకుండా చేయాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అలాగే, రుణ ఎగవేతను నేరపూరిత చర్యగా ప్రకటించాలని కోరుతున్నాయి. 10 లక్షల మంది ఉద్యోగులు రేపు సమ్మెలో పాల్గొనబోతున్నట్లు బ్యాంకు సంఘాలు తెలిపాయి. ప్రైవేటు బ్యాంకులైన ఐసీఐసీఐ బ్యాంకు, హెచ్ డీఎఫ్ సీ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు, కోటక్ మహింద్రా బ్యాంకు సేవలు మాత్రం యథావిధిగా పనిచేయనున్నాయి.

About the author

Related

JOIN THE DISCUSSION