కూర‌గాయ‌ల మీద బోర్లా ప‌డుకుని..!

జార్జియాలోని క్రోగ‌ర్ సూప‌ర్‌మార్కెట్‌లో క‌నిపించిన దృశ్యం ఇది. సూప‌ర్ మార్కెట్‌కు వ‌చ్చిన ఆ మ‌హిళ ఇలా ప్ర‌వ‌ర్తించింది. ఆ స‌మ‌యంలో ఆమె మ‌ద్యం మ‌త్తులో ఉన్న‌ట్లు సూప‌ర్ మార్కెట్ సిబ్బంది చెబుతున్నారు. సూప‌ర్ మార్కెట్‌కు వ‌చ్చిన ఆ మ‌హిళ మ‌ద్యం మ‌త్తులో ఉన్న‌ట్టు మొద‌ట్లోనే గుర్తించారు సిబ్బంది.

అదేమీ త‌మ‌కు కొత్త కాదులే అన్న‌ట్టు వ్య‌వ‌హ‌రించిన‌ప్ప‌టికీ.. తీరా ఆ మ‌హిళ చేసిన ఘ‌న‌కార్యానికి బిత్త‌ర పోవాల్సి వ‌చ్చింది వారికి. కూర‌గాయ‌ల ర్యాక్‌ల వ‌ద్ద‌కు వెళ్లి.. వాటి మీదకు ఎక్కేసి బోర్లా ప‌డుకుంది. కాళ్ల‌తో తంతూ విచిత్రంగా ప్ర‌వ‌ర్తించింది. ఆమెను లేప‌డానికి అక్క‌డి సిబ్బంది చేసిన ప్ర‌య‌త్నాలు ఫ‌లించ‌లేదు. దీనితో అక్క‌డి యాజ‌మాన్యం పోలీసుల‌కు ఫోన్ చేయ‌బోతుండ‌గా.. అక్క‌డి నుంచి క‌దిలింది.

About the author

Related

JOIN THE DISCUSSION