బీజేపీ కార్పొరేట‌ర్ ఆగం చేసిండు..!

అత్యాచార ఆరోప‌ణ‌ల కింద ఓ బీజేపీ కార్పొరేట‌ర్‌పై కేసు న‌మోదైంది. ఆయ‌న‌పై ఏకంగా ఐపీసీలోని ఆరు సెక్ష‌న్ల కింద కేసు న‌మోదు చేశారు పోలీసులు. ఆ కార్పొరేట‌ర్ పేరు ద‌యా గైక్వాడ్‌. ముంబైలోని క‌ల్యాణ్ (వెస్ట్‌) డివిజ‌న్ నుంచి ఆయ‌న బీజేపీ త‌ర‌ఫున కార్పొరేట‌ర్‌గా ఎన్నిక‌య్యారు. ద‌యా గైక్వాడ్ త‌న‌ను అత్యాచారం చేసిన‌ట్టు 27 సంవ‌త్స‌రాల ఓ మ‌హిళ‌ స్థానిక పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు.

త‌న‌పై లైంగిక దాడికి పాల్ప‌డిన త‌రువాత‌.. గైక్వాడ్ త‌న‌ను పెళ్లి చేసుకుంటాన‌ని మాట ఇచ్చాడ‌ని చెప్పార‌మె. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేస్తున్నారు. సెక్ష‌న్ 376, 232, 504, 506, 34ల అత‌నిపై కేసు న‌మోదు చేశారు. గైక్వాడ్‌ను నేడో, రేపో అదుపులోకి తీసుకుంటామ‌ని చెబుతున్నారు.

About the author

Related

JOIN THE DISCUSSION