బీజేపీ నేత‌ల గూండాగిరి

బీజేపీ నేత‌ల గూండాగిరి

ఫ్యాక్ష‌న్ సినిమాల త‌ర‌హాలో ఓ కారు నుంచి కిందికి దిగి, చేతిలో క‌ర్ర‌లు ప‌ట్టుకుని గుంపులు గుంపులుగా టోల్ ప్లాజా సిబ్బందిపైకి దాడికి వెళ్తోన్న వీళ్లు.. ఏ గూండాలో.. రౌడీలో అనుకుంటే పొర‌పాటే. క్ర‌మ‌శిక్ష‌ణ‌కు మారుపేరుగా చెప్పుకొనే బీజేపీ నాయ‌కులు వాళ్లంతా.

టోల్ ప్లాజా సూప‌ర్‌వైజ‌ర్‌పై ఇలా క‌ట్ట క‌ట్టుకుని దాడికి పాల్ప‌డ్డారు. మ‌ధ్య‌ప్ర‌దేశ్ రాజ‌ధాని భోపాల్‌-ఇండోర్ జాతీయ ర‌హ‌దారిపై సీహోర్ స‌మీపంలో ఉన్న టోల్ ప్లాజా వ‌ద్ద ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఈ వారి దాదాగిరి, దౌర్జ‌న్యం మొత్తం అక్క‌డి సీసీ కెమెరాలో రికార్డ‌యింది. ప‌దుల సంఖ్య‌లో బీజేపీ నాయ‌కులు ఇలా క‌ర్ర‌లు ప‌ట్టుకుని దాడికి దిగ‌డంతో ఆ మార్గంలో వెళ్లే వాహ‌న‌దారులు భ‌య‌భ్రాంతుల‌కు గుర‌య్యారు. ఇంకో విష‌యంం- మ‌ధ్య‌ప్ర‌దేశ్ కొన్నేళ్లుగా అధికారంలో ఉన్న‌ది బీజేపీయే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *