కర్ణాటకను తాకిన బ్లూవేల్ గేమ్.. తెలుగు రాష్ట్రాలలోని పిల్లలు కూడా ఆడుతున్నారా..!

బ్లూ వేల్ గేమ్.. ఆ పేరుతో పిలవడం కంటే.. కిల్లర్ గేమ్ అని అనడమే బెస్ట్ అనుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పటికే ఎంతో మంది పిల్లల ప్రాణాలు తీసింది ఈ గేమ్..! రష్యా దేశంలో ఏకంగా 100 మందికి పైగా పిల్లలు ఈ గేమ్ ఆడి ప్రాణాలను పోగొట్టుకున్నారు. తెల్లవారుజామున మూడు గంటలకు లేవండి.. మీ ఫ్రెండ్ ను కొట్టండి.. అంటూ మొదలయ్యే ఈ గేమ్ చివరికి ఆత్మహత్య చేసుకోండి అనే దాకా వెళుతుంది. ఇప్పటికే ఇలాంటి మరణాలు ఉత్తర భారతదేశంలో నమోదయ్యాయి. తాజాగా కర్ణాటక రాష్ట్రంలో ఓ యువకుడు ఈ గేమ్ ను ఆడి ప్రాణాలను పోగొట్టుకున్నాడు. ఇప్పటికే ఈ గేమ్ ఇప్పుడు కర్ణాటక రాష్ట్రాన్ని తాకింది.. అది కూడా 11 సంవత్సరాల అమ్మాయి ఈ గేమ్ ను ఆడుతోందంటే అర్థం చేసుకోండి. గేమ్ లో చెప్పిన విధంగా ఆ అమ్మాయి తన చేతిని కట్ చేసుకుంది.

కర్ణాటక రాష్ట్రం హుబ్బల్లి రాజనగరలో ఈ ఘటన చోటుచేసుకుంది. 11 సంవత్సరాల అమ్మాయి చేతిని కట్ చేసుకొని స్కూలుకు వెళ్ళింది. ఆ విషయాన్ని తన స్నేహితులకు చెప్పింది. అది ఆమె టీచర్ దాకా వెళ్ళగా ఎందుకు ఇలా కట్ చేసుకున్నావని అడగ్గా తాను ఓ గేమ్ ఆడుతున్నాను.. ఆ గేమ్ లో చెప్పినట్లు చేశానని చెప్పుకొచ్చింది. వెంటనే ఆమె తల్లిదండ్రులకు టీచర్ కబురు పంపింది. వారిని పిలిపించి ఆ అమ్మాయి ఆడుకొనే ఫోన్ లో నుండి గేమ్ ను డిలీట్ చేయించారు. తెలుగు రాష్ట్రాలలోని పిల్లలు కూడా ఆడుతున్నారా అన్నమానం రేకెత్తుతోంది.

 

About the author

Related

JOIN THE DISCUSSION