ప్రేయసి పుట్టినరోజున ఆమె హాస్టల్ దగ్గరకు వెళ్ళాడు.. ‘అన్న’ అని చెప్పిన వ్యక్తితో చనువుగా ఉండడం చూసి..!

నాలుగేళ్ళుగా ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాడు. చెన్నైలో జాబ్ వదులుకొని వచ్చి మరీ హైదరాబాద్ లో ఉన్నాడు. కానీ ఏమిదో ఏమో కొద్ది రోజుల క్రితం మాట్లాడ్డం మానేసింది ఆ అమ్మాయి. ఆమె పుట్టిన రోజుకు గిఫ్ట్ ఇద్దామని.. ఓ సారి కలుద్దామా అని అడిగాడు. తన అన్న వస్తాడు వీలుపడదు అని చెప్పింది. అయినప్పటికీ సర్ ప్రైజ్ ఇద్దామని అనుకుని ఆమె ఉంటున్న హాస్టల్ దగ్గరకు వెళ్ళాడు. తీరా చూస్తే అన్న అని చెప్పిన వ్యక్తితో ఆమె సన్నిహితంగా మెలగడం చూశాడు.. అంతే తను లేని ఈ జీవితం వద్దనుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తనకు జరిగిన అన్యాయాన్ని ఫేస్ బుక్ లో పోస్ట్ చేసి.. ట్రైన్ కింద తల పెట్టి ఆత్మహత్య చేసుకున్నాడు.

Naresh Chinnaさんの投稿 2017年8月7日

సింగరేణి ఎస్సార్సీ-3 గనిలో పనిచేసే మేకా మల్లయ్య చిన్న కుమారుడు నరేష్. ఎంబీఏ చదివి చెన్నై క్యాప్ జెమినీలో ప్రాసెస్ అసోసియేట్ గా ఉద్యోగం సంపాదించాడు. ఆ తర్వాత అతను శ్రీరాంపూర్‌లోని కృష్ణాకాలనీకి చెందిన ఒక యువతితో ప్రేమలో పడ్డాడు. ఆమె కూడా ఎంబీఏ చదువుకుని హైదరాబాద్ లో పని చేస్తుండేది. ప్రేయసి కోసం చెన్నైలోని ఉద్యోగాన్ని ఆమె కోసం వదులుకుని హైదరాబాద్ కు వచ్చేశాడు. నాలుగేళ్ల పాటు వారు రిలేషన్ షిప్ లో ఉన్నారు. ఈ క్రమంలో ఏం జరిగిందో ఏమో… ఇద్దరి మధ్యా ప్రేమ బెడిసికొట్టింది. అయితే.. వీరి మధ్య మనస్పర్థలు వచ్చి నిన్ను పెళ్లి చేసుకోనని ఆమె చెప్పింది. అయినప్పటికీ ఆమె మాత్రమే కావాలని కోరుకున్నాడు.

Naresh Chinnaさんの投稿 2017年8月7日

అప్పుడప్పుడు ఆమెకు ఫోన్ చేస్తూ మాట్లాడడానికి ప్రయత్నించినప్పటికీ అక్కడి నుండి రెస్పాన్స్ ఉండేది కాదు. గత సోమవారం నాడు ఆమె పుట్టిన రోజు కావడంతో కలుద్దామని అడిగాడు. ఉదయం పూట తన అన్నయ్య వస్తున్నాడని, బయటకు రాలేనని, సాయంత్రం కలుస్తానని చెప్పింది. సాయంత్రం వరకూ వేచి చూడలేక, ముందుగానే ఆమె ఉన్న హాస్టల్ వద్దకు వెళ్లాడు నరేష్. ఆమె మరో యువకుడితో సన్నిహితంగా ఉండటం చూసి షాక్ తిన్నాడు. ఇన్నాళ్ళూ అన్నయ్య అన్నయ్య అంటే ఎవరో అనుకున్నానని.. తీరా అతనితోనే సన్నిహితంగా ఉండడం చూసి తట్టుకోలేకపోయాడు నరేష్. దీంతో అతను తనకు జరిగిన అన్యాయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఆత్మహత్య చేసుకున్నాడు.

సికింద్రాబాద్ లో భాగ్యనగర్ ఎక్స్ ప్రెస్ రైలు ఎక్కి, హసన్ పర్తి చేరుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తన మీదే ఆధారపడి ఉన్న తల్లిదండ్రుల గురించి ఒక్కసారి ఆలోచించి ఉండి ఉంటే నరేష్ ప్రాణాలతో ఉండేవాడు. పాడు ప్రేమ ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది.

Naresh Chinnaさんの投稿 2017年8月7日

About the author

Related

JOIN THE DISCUSSION