తలపై గన్ పెట్టినా తన హ్యాండ్ బ్యాగ్ ఇవ్వలేదు.. ఇంతకూ అందులో ఏమున్నాయో తెలుసా..?

ప్రాణం ముఖ్యమా.. హ్యాండ్ బ్యాగ్ ముఖ్యమా అంటే మీరు ఏమంటారో కానీ ఆ అమ్మాయి మాత్రంతనకు హ్యాండ్ బ్యాగే ముఖ్యమని రుజువు చేసింది. చంపేస్తా.. నీ హ్యాండ్ బ్యాగ్ ఇవ్వకుంటే అంటూ ఓ వ్యక్తి ఆమె తలపై గన్ పెట్టాడు. కానీ ఆ అమ్మాయి అతని బెదిరింపులకు లొంగలేదు. చివరిదాకా పోరాడింది.. తన హ్యాండ్ బ్యాగ్ ఆ వ్యక్తి తీసుకొని వెళ్ళకుండా అడ్డుకుంది. ఇంతకూ ఆ బ్యాగ్ లో ప్రాణాలకన్నా విలువైనవి ఏమున్నాయనేగా మీ డౌట్.. ఆ అమ్మాయి డిగ్రీ సర్టిఫికేట్.. అలాగే మాస్టర్స్ కోసం రెడీ చేసిన థీసిస్ పేపర్..!

ఈ ఘటన సౌత్ ఆఫ్రికాలోని జొహన్నెస్ బర్గ్ లో చోటుచేసుకుంది. 26 సంవత్సరాల ‘నొక్సోలో నుట్సి’ అనే యువతి రెండు బ్యాగులను పట్టుకొని వీధిలో నడుచుకుంటూ వెళుతోంది. ఇంతలో ఆమె పక్కనే వచ్చి ఓ కార్ ఆగింది. అందులో నుండి కొందరు దుండగులు తుపాకీలు చేతబట్టుకొని దిగారు. ఆమె చేతిలో మొదటి బ్యాగును తీసేసుకుని కారులో వేసుకున్నారు. ఈ ఘటన మొత్తం అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అవుతూ ఉంది. రెండో హ్యాండ్ బ్యాగ్ తీసుకోవాలని ప్రయత్నించిన వారికి ఆమె అంత ఈజీగా ఇవ్వలేదు. తీవ్రంగా ప్రతిఘటించింది. ఇద్దరు యువకులు ఆమెను పట్టుకొని గట్టిగా లాగారు కూడా.. ఎంతసేపటికీ ఆమె ఇవ్వకపోవడంతో వారు వెళ్ళిపోయారు. ఈ విషయం తెలుసుకున్న మీడియా సంస్థలు ఇంతకూ అందులో ఏమున్నాయని అడగ్గా తన డిగ్రీ సర్టిఫికెట్.. మాలిక్యులర్ జువాలజీలో మాస్టర్స్ కి సంబంధించిన థీసిస్ ఉన్న హార్డ్ డిస్క్ అందులో ఉందట.. తాను ఏదైనా పోగొట్టుకోగలను కానీ దాన్ని మాత్రం కాదని నొక్సోలో బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపింది.

https://www.youtube.com/watch?v=C5Vn3tljS0Q

About the author

Related

JOIN THE DISCUSSION