వ‌క్షస్థ‌లాన్ని తాక‌నిస్తే..రెడ్‌క్రాస్‌కు విరాళం ఇస్తానంటూ!

చైనాలో ఓ యువ‌కుడు ఆట‌వికంగా ప్ర‌వ‌ర్తించాడు. యువ‌తుల వ‌క్ష‌స్థ‌లాన్ని తాక‌నిస్తే..రెడ్‌క్రాస్‌కు భారీగా విరాళాన్నిఇస్తాన‌ని ప్ర‌క‌టించాడు. అక్క‌డితో ఆగ‌లేదు. రోడ్డుమీద‌, షాపింగ్ మాల్స్‌ల‌ల్లో తన‌కు న‌చ్చిన అమ్మాయిల వ‌ద్ద‌కు వెళ్లి ఈ విష‌యాన్ని చెప్ప‌గా.. దాన్ని సానుకూలంగా తీసుకున్నారు వారు.

రెడ్‌క్రాస్‌కు భారీగా విరాళాన్ని ఇస్తున్నాడ‌నే ఉద్దేశంతో.. వారు త‌మ వ‌క్ష‌స్థ‌లాన్ని తాక‌నిచ్చారు. గ్వాంఘ్జీ ప్రావిన్స్‌లో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఆ యువ‌కుడి పేరు గ్ఝుంగ్‌. ప‌బ్లిగ్గా సాగుతోన్న ఈ వ్య‌వ‌హారాన్ని చూడ‌లేక కొంద‌రు స్థానిక పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు.

దీనితో రంగంలోకి దిగిన పోలీసులు ఈ ఘ‌ట‌న వెనుక ఉన్న అస‌లు విష‌యాన్ని తెలుసుకుని ఆశ్చ‌ర్యపోయారు. అలా ఆ యువ‌కుడికి త‌మ వ‌క్ష‌స్థ‌లాన్ని అప్ప‌గించిన యువ‌తులంద‌రూ జూనియ‌ర్ ఆర్టిస్టులు.

ఆ యువ‌కుడు వారి చేతికి భారీగా డ‌బ్బును ఇచ్చి.. ఇలా నాట‌కం ఆడించాడ‌ట‌. ఇదొఓ ప్రాంక్‌. పైగా రెడ్‌క్రాస్‌కు విరాళాన్ని కూడా ఇవ్వ‌లేద‌ట‌. దీనితో పోలీసులు ఆ యువ‌కుడిని అదుపులోకి తీసుకున్నారు. రెడ్‌క్రాస్ సొసైటీకి విరాళాల‌ను రాబ‌ట్ట‌డానికే తాను ఈ ప్రాంక్ సృష్టించిన‌ట్టు చెబుతున్నాడు.

About the author

Related

JOIN THE DISCUSSION