కోడి పందాల‌ను వెండితెర‌పై చూద్దాం

కోడి పందాల‌ను వెండితెర‌పై చూద్దాం

కోడి పందాల‌ను హైకోర్టు నిషేధించింది. ఈ సారి కోడి పందాలు ఉంటాయో, లేవో తెలీదు. అస‌లు సిస‌లు కోడి పందాలకు ఈ సారి వెండితెర వేదికైంది. ద‌శాబ్దాలుగా తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌ను ఏలుతున్న ఇద్ద‌రు స్టార్ హీరోల సినిమాల సినిమాలో రెండు రోజుల వ్య‌వ‌ధిలో విడుద‌లవుతున్నాయి. ఆ సినిమాలు ఇద్ద‌రికీ మైలురాళ్ల‌వంటివే.

ఒక‌రికి 150వ చిత్రం. ఇది చిరంజీవికి క‌మ్‌బ్యాక్ మూవీ. మ‌రొక‌రికి 100 సినిమా. ఒక‌టి స‌మ‌కాలీన రాజ‌కీయ చిత్రం.. మ‌రొక‌టి పీరియాడిక‌ల్‌.. ఆ ఇద్ద‌రు హీరోలు మెగాస్ట‌ర్ చిరంజీవి, యువ‌ర‌త్న బాల‌కృష్ణ‌. ఈ ఇద్ద‌రు హీరోల సినిమాలు ఒక‌ట్రెండు రోజుల వ్య‌వ‌ధిలో విడుద‌ల కాబోతుండ‌టం కోడి పందాల‌ను మించిన ఉత్కంఠ‌త‌ను రేపుతున్నాయి. ఈ రెండు సినిమాల్లో ఏది ప‌రాజ‌యం పాలైనా చిత్ర ప‌రిశ్ర‌మ‌కు అదొక చేదు జ్ఞాప‌క‌మే. అటు చిరంజీవి, ఇటు బాల‌కృష్ణ‌లిద్ద‌రూ రాజ‌కీయాల్లో ఉండ‌టంతో.. ఈ పోటీ కాస్తా రాజ‌కీయ రంగు పులుముకొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *