ఖైదీ మేనియా..

ఖైదీ మేనియా..

తెలుగు రాష్ట్రాల‌ను మెగాస్టార్ మేనియా క‌మ్మేసింది. దాదాపు ప‌దేళ్ల త‌రువాత చిరంజీవి న‌టించిన 150వ చిత్రం ఖైదీ నెంబ‌ర్ 150 విడుద‌లైన థియేట‌ర్ల‌లో పండ‌గ వాతావ‌ర‌ణం నెల‌కొంది. ఎముక‌లు కొరికే చ‌లిలోనూ బెనిఫిట్ షో కోసం అర్ధ‌రాత్రి నుంచి చిరంజీవి అభిమానులు థియేట‌ర్ల వ‌ద్ద టికెట్ల కోసం బారులు తీరారు.

థియేట‌ర్ల‌న్నీ అభిమానుల బ్యాన‌ర్ల‌తో నిండిపోయాయి. బాణాసంచా పేల్చి అభిమానులు పండ‌గ చేసుకున్నారు. రాజ‌కీయాల్లో ప్రవేశించ‌డానికి చిరంజీవి న‌టించిన చివ‌రి చిత్రం విడుద‌ల సంద‌ర్భంగా ఎలాంటి సంద‌డి నెల‌కొందో.. ఇప్పుడూ అలాంటి దృశ్యాలే క‌నిపిస్తున్నాయి. హైద‌రాబాద్‌, వ‌రంగ‌ల్‌, విజ‌య‌వాడ‌, విశాఖ‌ప‌ట్నం.. ఇలా ప్ర‌తి చోటా.. ప్ర‌తి థియేట‌ర్‌లో అభిమానుల కోలాహ‌లం నెల‌కొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *