నాగబాబు వ్యాఖ్యలపై స్పందించిన చిరంజీవి

నాగబాబు వ్యాఖ్యలపై స్పందించిన చిరంజీవి

ఖైదీ నెంబర్ 150 ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో యండమూరిపైనా, రామ్ గోపాల్ వర్మ పైనా మెగా బ్రదర్ నాగబాబు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్నే రేపాయి. ఈ వివాదంపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. నాగబాబు ఆ కామెంట్స్ చేయడం తనకు కూడా ఆశ్చర్యం కలిగించిందన్నారు.

తనపై చేసే విమర్శలను పట్టించుకోనని, కానీ నాగబాబు నాలాగ కాదు. కొందరు సంస్కారం లేకుండా మాట్లాడతారు. యండమూరి కామెంట్స్ కించ పరిచే విధంగా ఉన్నాయి కాబట్టే నాగబాబు అలా మాట్లాడారన్నారు. వ్యక్తిత్వ వికాసం క్లాసులు తీసుకొనే ముందు మంచి ఉంటుంది.. చెడు ఉంటుంది. సెలెబ్రిటీ లోని మంచి క్వాలిటీలను చెప్పాలని, కించపరిచేలా ఉండకూడదని చిరంజీవి చెప్పారు. చివరికి నా భార్య గురించి కూడా అమర్యాదగా మాట్లాడాడు కాబట్టే నాగబాబు అలా మాట్లాడాడని చిరంజీవి తన సోదరుడి కామెంట్స్ ను సమర్థించుకున్నారు. ఇక రామ్ గోపాల్ వర్మ చేసిన ట్వీట్లను పట్టించుకోనని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *