`టైగ‌ర్‌` ముందు తోడేళ్లెంత‌?

టైగ‌ర్‌తో పోల్చుకుంటే తోడేలు అల్ప‌ప్రాణి. టైగ‌ర్ ముందు తోడేలు బలాదూర్‌. ఎందులోనూ సాటి రాదు. అలాంటి తోడేళ్లు టైగ‌ర్‌ను ఎదిరించ‌గ‌ల‌వా? ఎదిరించ‌లేవు క‌దా!

ఈ సీన్ కూడా అలాంటిదే. `టైగ‌ర్ జిందా హై` మూవీలో మంచుకొండ‌ల్లో తోడేళ్ల‌తో `టైగ‌ర్‌` సల్మాన్‌ఖాన్ పోరాడే దృశ్యాలు ఇవి. ఈ ఫైట్ కోసం అర‌డ‌జ‌ను నిజ‌మైన తోడేళ్ల‌ను వినియోగించార‌ట‌.

2012 లో కబీర్ ఖాన్ తెరకెక్కించిన ‘ఏక్ థా టైగర్’ మూవీకి సీక్వెల్ గా తెర‌కెక్కిందీ మూవీ. అలీ అబ్బాస్ జఫర్ దర్శకత్వం వ‌హించారు. ఈ చిత్రంలో ఇండియ‌న్ స్పైగా సల్మాన్‌, పాక్ గూఢ‌చారిగా కత్రినా కైఫ్ న‌టించారు.

కంప్లీట్ యాక్ష‌న్ ఎంటర్‌టైన్‌మెంట్‌గా తెర‌కెక్కించారు. ఈ సినిమా ఈ నెల 22న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల కాబోతోంది.. ఒక్క పాక్‌లో త‌ప్ప‌.

About the author

Related

JOIN THE DISCUSSION