భ‌యం..మీ బెడ్‌రూమ్‌లో..!

బాలీవుడ్‌లో స్పైసీ మూవీల‌కు కొద‌వ ఉండ‌ట్లేదు. అప్ప‌ట్లో జూలీ, జిస్మ్, జిస్మ్ సీక్వెల్‌, తాజాగా జూలీ సీక్వెల్‌.. ఇలా గ్యాప్ ఇవ్వ‌కుండా రొమాంటిక్ థ్రిల్ల‌ర్లు బాలీవుడ్ ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రిస్తూనే వ‌స్తున్నాయి. అదే జాబితాలో ఇంకో రొమాంటిక్ థ్రిల్ల‌ర్ ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. అదే రాగిణి ఎంఎంఎస్‌ రిట‌ర్న్స్‌.

గ‌తంలో రాగిణి ఎంఎంఎస్‌, రాగిణి ఎంఎంఎస్‌-2ల‌కు సీక్వెల్‌గా దాని మూడో భాగం కూడా విడుద‌ల‌కు రెడీ అయింది. ఆ మూవీ పేరు `రాగిణి ఎంఎంఎస్ రిట‌ర్న్స్‌..`. ఈ మూవీ టీజ‌ర్‌ను ఇటీవ‌లే విడుద‌ల చేశారు. `ఫియ‌ర్ విల్ ఎంట‌ర్ యువ‌ర్ బెడ్‌రూమ్‌..` అనేది దీని ట్యాగ్‌లైన్‌. 2011లో వ‌చ్చిన రాగిణి ఎంఎంఎస్ రొమాంటిక్ హార‌ర్ మూవీ.

ఫౌండ్ ఫుటేజీ సిస్ట‌మ్‌లో దాన్ని రూపొందించారు. రాజ్‌కుమార్ రావు, ఖైనాజ్ మోతీవాలా లీడ్ రోల్స్ చేశారు. ఆ సినిమా బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. దీనితో- 2014లో రాగిణి ఎంఎంఎస్‌-2ను తెర‌కెక్కించారు. మాజీ పోర్న్‌స్టార్ స‌న్నీలియోన్ ఇందులో లీడ్‌రోల్ చేసింది.

అదీ హిట్టే. రాగిణి ఎంఎంఎస్ రిటర్న్స్ పేరుతో దాని సీక్వెల్‌ను రూపొందించారు. క‌రిష్మా శ‌ర్మ‌, సిద్ధార్థ గుప్తా ప్ర‌ధాన పాత్ర‌ల‌ను పోషించారు. ఎఎల్‌టీ బాలాజీ బ్యాన‌ర్‌పై ఏక్తా క‌పూర్ ఈ మూవీని నిర్మించారు. నిజానికి- ఈ మూడు చిత్రాలూ ఈ బ్యాన‌ర్ కింద వ‌చ్చిన‌వే.

About the author

Related

JOIN THE DISCUSSION