లైవ్ షో ముందు రిపోర్టర్ మీదకు ఎక్కిన బొద్దింక..!

సాధారణంగా సినిమా అయిపోయిన తర్వాత షూటింగ్ సమయంలో చేసిన అల్లర్లు.. యాంకరింగ్ చేసే సమయంలో వారు చేసిన తప్పులు ఉన్నటువంటి వీడియోలను చూడడానికి ప్రేక్షకులు ఎంతగానో ఆసక్తి చూపుతారు. వీటినే బ్లూపర్లు అని కూడా అంటారు. ఆ వీడియోలు ఎంతో ఫన్నీగా ఉంటాయి. ఇప్పటికే లైవ్ షోలు చేస్తున్నప్పుడు వెనకనుండి వచ్చి మనుషులు చేసే అల్లర్లు, చిన్న చిన్న జంతువులు రావడం ఎన్నో వీడియోలలో చూసే ఉంటాం. తాజాగా ఓ లేడీ రిపోర్టర్ పై బొద్దింక పడడంతో ఆమె కేకలు పెట్టింది.. ఆ వీడియోను లైవ్ లో చాలామంది చూశారు కూడా..!

ఈ ఘటన కేటీఎల్ఏ రిపోర్టర్ మేరీ బెత్ మెక్ డేడ్ జీవితంలో చోటుచేసుకుంది. కాలిఫోర్నియాకు చెందిన ఈమె తన లైవ్ షోకు ప్రిపేర్ అవుతుండగా ఓ బొద్దింక వచ్చి ఆమెపై వాలింది. వెంటనే కేకలు వేయడం మొదలుపెట్టింది. బొద్దింకను తీసి పారేయడానికి కెమెరామెన్ ముందుకు వచ్చాడు. అయితే ఆమె శరీరంపైనే ఉందని గమనించింది.. వెంటనే దులిపివేసి నవ్వుతూ ఏమి జరిగిందో చెప్పింది.

About the author

Related

JOIN THE DISCUSSION