కాలేజీకంటూ వెళ్లి..పంపుసెట్టు ప‌క్క‌న చిక్కిన ప్రేమ‌జంట‌

త‌ల్లిదండ్రుల‌తో కాలేజీకి వెళ్తున్నానంటూ చెప్పి ఇంట్లో నుంచి బ‌య‌లుదేరిన ఓ యువ‌తి త‌న ప్రియుడితో క‌లిసి ఓ పాడుబ‌డ్డ ఇంట్లో క‌నిపించింది. వారి ప్ర‌వ‌ర్త‌న‌పై అనుమానం వ‌చ్చిన స్థానికులు వారిద్ద‌రినీ ప‌ట్టుకుని పోలీసుల‌కు అప్ప‌గించారు. వారితోపాటు వ‌చ్చిన మ‌రో ముగ్గురిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఈ ఘ‌ట‌న జార్ఖండ్‌లోని ధ‌న్‌బాద్ స‌మీపంలోని తోప్‌చాంచి పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో చోటు చేసుకుంది. ధ‌న్‌బాద్ శివార్ల‌లోని దుమ్రి బ్లాక్ ప‌రిధిలో ఉన్న ఓ టాప్ ఇంజినీరింగ్ క‌ళాశాల‌లో రేఖ (పేరు మార్చాం) అనే యువ‌తి బీటెక్ చ‌దువుతోంది. కొంత‌కాలంగా ఆమె త‌న స్నేహితుడు బిశ్వంత్‌ను ప్రేమిస్తోంది.

కాలేజీకంటూ బ‌య‌లుదేరిన వారిద్ద‌రూ బైక్‌పై భుయియా చిత్రో ప్రాంతానికి వ‌చ్చారు. ప్ర‌ధాన ర‌హ‌దారి నుంచి సుమారు మూడు కిలోమీట‌ర్ల మేర లోప‌ల ఉంటుందీ గ్రామం. చుట్టూ పంట‌పొలాలు ఉంటాయి. రైతులు తాము విశ్రాంతి తీసుకోవ‌డానికి వినియోగించే ఓ పాడ‌బ‌డ్డ ఇంటికి వెళ్లారు ఈ ప్రేమికులు.

వారితో పాటు మ‌రో ముగ్గురు స్నేహితులు కూడా వ‌చ్చారు. ప్రేమికులు ఇద్ద‌రూ ఇంట్లో ఉండ‌గా.. ముగ్గురు స్నేహితులు బ‌య‌టే క‌నిపించారు. అనుమానాస్ప‌దంగా క‌నిపించ‌డంతో స్థానికుడొక‌రు వారిని ప్ర‌శ్నించారు. ఈ విద్యార్థులు దురుసుగా స‌మాధానం ఇచ్చారు. దీనితో ఆ వ్య‌క్తి మొత్తం గ్రామానికంత‌టికీ ఈ విష‌యం చెప్పాడు.

గుర్తు తెలియ‌ని వ్యక్తులు వ‌చ్చార‌న‌గానే ఊరు ఊరంతా పోలోమంటూ ఆ పాడుబ‌డ్డ ఇంటి వ‌ద్ద‌కు చేరుకుంది. త‌లుపు తెరిచి చూడ‌గా.. ప్రేమికులిద్ద‌రూ ఏకాంతంగా క‌నిపించారు. దీనితో వారు ఆ అయిదుమందినీ ప‌ట్టుకున్నారు. తోప్‌చాంచీ పోలీసుల‌కు సమాచారం ఇచ్చారు.

స‌మాచారం అందుకున్న వెంట‌నే సంఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్న పోలీసులు ఆ విద్యార్థుల‌ను అదుపులోకి తీసుకున్నారు. ఎవ‌రూ వారిపై ఫిర్యాదు చేయ‌డానికి ముందుకు రాక‌పోవ‌డంతో.. కేసు న‌మోదు చేయ‌లేదు. వారి త‌ల్లిదండ్రుల‌ను పిలిపించి, కౌన్సెలింగ్ ఇచ్చారు. బిశ్వంత్‌.. ఓ రిటైర్డ్ స్టేష‌న్ హౌస్ ఆఫీస‌ర్ కుమారుడ‌ని తేలింది.

About the author

Related

JOIN THE DISCUSSION