బ్రిట్నీ స్పియర్స్ ను భయపెట్టిన అభిమాని..!

కొద్దిరోజుల క్రితం పాప్ సింగర్ అరియానే గ్రాండే ప్రోగ్రాంలో బాంబ్ బ్లాస్ట్ జరగడంతో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ ఘటన తర్వాత పాప్ స్టార్లు స్టేజి షోలు ఇవ్వడం బాగా తగ్గించారు. ఇక ఎవరైనా ఇస్తున్నా సెక్యూరిటీని చాలా పటిష్టం చేశారు. తాజాగా బ్రిట్నీ స్పియర్స్ స్టేజ్ షోలో ఓ వ్యక్తి కలకలం రేపాడు. ఆమె అభిమాని ఏకంగా స్టేజీ మీదకు వచ్చి బ్రిట్నీని ఆకర్షించడానికి కుప్పిగంతులు వేశాడు. ఈ ఘటనతో బ్రిట్నీ ఒక్క సారిగా షాక్ కు గురైంది.

 

లాస్ వేగాస్ లోని ప్లానెట్ హాలీవుడ్ లో బ్రిట్నీ ‘పీస్ ఆఫ్ మి’ షోలో భాగంగా ప్రదర్శన ఇస్తున్నప్పుడు 37 సంవత్సరాల జెస్సీ వెబ్ అనే వ్యక్తి సెక్యూరిటీని దాటుకొని మరీ స్టేజి మీదకు వచ్చాడు. ఆమె వెనకాల ఉన్న డ్యాన్సర్లు అతన్ని ఆపేశారు.. వెంటనే సెక్యూరిటీ మొత్తం ఆమె చుట్టూ చేరుకుంది. ఈ ఘటనతో బ్రిట్నీ షాక్ కు గురైంది. అతని దగ్గర గన్ ఉందా అంటూ మైక్ ఆన్ లో ఉండగానే సెక్యూరిటీ సిబ్బందిని అడిగింది. ఆ తర్వాత సెక్యూరిటీ అతన్ని పోలీసులకు అప్పగించారు. ప్రస్తుతం అతన్ని విచారిస్తున్నారు. 35ఏళ్ల బ్రిట్నీ ఈ ఘటనతో చాలా భయపడిపోయిందని ఆమె సన్నిహితులు తెలిపారు.

About the author

Related

JOIN THE DISCUSSION