ఈ క్రికెటర్లు సినిమాల్లో నటించారని చాలా మందికి తెలీదు..!

సినిమా-క్రికెట్ భారతదేశంలో రెండు శక్తివంతమైన విభాగాలు.. వీటి గురించి తెలుసుకోవాలనే కుతూహలం ప్రతి ఒక్కరికీ ఉంటుంది. ఇక ఈ రెండిటికి ఉన్న సంబంధమే వేరు.. బాలీవుడ్ భామలతో క్రికెటర్ల చట్టపట్టాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక మన క్రికెటర్లు చాలా మంది సినిమాల్లో నటించిన వారే..! కపిల్ దేవ్ దగ్గర నుండి సచిన్ దాకా చాలా మంది సినిమాల్లో తళుక్కుమన్నారు. వీవీఎస్ లక్ష్మణ్ వసంతం సినిమాలో, శ్రీశాంత్ టీమ్5 సినిమాలో ఇలా మన అందరికీ తెలిసి నటించిన సినిమాలు చాలానే ఉన్నాయి.. కానీ మన క్రికెట్ వీరులు నటించిన కొన్ని సినిమాల గురించి చాలా మందికి తెలీదు.. వాటిలో కొన్ని..!

 

యువరాజ్ సింగ్..!

యువరాజ్ సింగ్ తండ్రి యోగరాజ్ సింగ్ మంచి నటుడని ప్రతి ఒక్కరికీ తెలిసిందే.. అయితే యువరాజ్ సింగ్ కూడా చిన్నప్పుడు తండ్రితో కలసి చాలా సినిమాల్లో నటించాడు. పంజాబీ సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా యువీ కనిపించాడు. ఈ సన్నివేశం ‘మెహందీ షగ్నా దీ’ అనే సినిమాలోనిది.

ఈ వీడియోలో యువరాజ్ చాలామంది పిల్లలతో కలసి పరిగెత్తుతాడు.. కానీ రేసులో తన స్నేహితుడి చేతిని పట్టుకొని విజయం సాధిస్తాడు. ఎందుకు అలా చేశావు అని ప్రశ్నించగా జీవితంలో కలిసి ఉంటేనే విజయం సాధిస్తాము అని సమాధానం చెబుతాడు. కావాలంటే అప్పటి యువరాజ్ ఎలా ఉండేవాడో ఓ సారి చూడండి.

డేల్ స్టెయిన్:

అరవీర భయంకర ఫాస్ట్ బౌలర్లలో డేల్ స్టెయిన్ ఒకడు. డేల్ స్టెయిన్ ‘బ్లెండెడ్’ అనే హాలీవుడ్ సినిమాలో కనిపించాడు. అందులో ఆడమ్ సాండ్లర్ తో కలసి స్టెయిన్ నటించడం విశేషం. ఇందులో కూడా స్టెయిన్ బౌలింగ్ వేస్తూ దర్శనం ఇస్తాడు.

దినేష్ మోంగియా:

2003 వరల్డ్ కప్ జట్టులో దినేష్ మోంగియా కూడా సభ్యుడే.. 2002 లో జింబాబ్వేతో జరిగిన వన్డే సిరీస్ లో మోంగియా 159 పరుగులు బాది మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ను ఏర్పాటు చేసుకున్నాడు. అటువంటి మోంగియా ‘కబాబ్ మే హడ్డి’ అనే బాలీవుడ్ సినిమాలో నటించాడు. అయితే ఈ సినిమా పెద్దగా హిట్ కాకపోవడంతో మోంగియా పేరు పెద్దగా వినపడలేదు. ఇందులో మోంగియా అమితాబ్ బచ్చన్ కు నకలుగా చేయడం విశేషం.

హర్భజన్ సింగ్ అండ్ కో:

హర్భజన్ సింగ్ మాత్రమే కాకుండా ఇర్ఫాన్ పఠాన్, మొహమ్మద్ కైఫ్, జవగళ్ శ్రీనాథ్, ఆశిష్ నెహ్రా కూడా ఒకే సినిమాలో కనిపిస్తారు. ఇంతకూ అది ఏ సినిమానో తెలుసా సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్, ప్రియాంక చోప్రా నటించిన ‘ముఝ్ సే షాదీ కరోగీ’ సినిమా..! కపిల్ దేవ్ కూడా ఉన్నాడనుకోండి. క్లైమాక్స్ సీన్ జరుగుతుండగా మన వాళ్ళు అందరూ కనిపిస్తారు.

మహేంద్ర సింగ్ ధోని:

మహేంద్ర సింగ్ ధోని మీద బయోపిక్ వచ్చింది కానీ మహీ నటించిన సినిమా ఏంటని అనుకుంటున్నారా.. ‘హుక్ యా క్రూక్’ చిత్రం. ఈ చిత్రం విడుదలకు నోచుకోలేదు. ఈ సినిమాలో జెనీలియా, జాన్ అబ్రహాం లీడ్ రోల్స్ చేశారు. డేవిడ్ ధావన్ డైరెక్టర్ ఈ సినిమాకు..!

 

About the author

Related

JOIN THE DISCUSSION