వినండ‌హో! తెలంగాణ థియేట‌ర్ల‌లో రోజూ అయిదాట‌లు

సినీ ప్రియులకు తెలంగాణ ప్ర‌భుత్వం తీపి క‌బురు అందించింది. ఇక‌పై రోజూ నాలుగాట‌ల‌కు బ‌దులుగా అయిదు ఆట‌ల‌ను ప్ర‌ద‌ర్శించ‌బోతున్నారు. దీనికి సంబంధించిన ఉత్త‌ర్వుల‌ను త్వ‌ర‌లోనే విడుద‌ల కాబోతున్నాయి. ద‌స‌రా సీజ‌న్ నుంచే ఈ అయిదాట‌ల విధానం అమ‌ల్లోకి రాబోతోంది.

 

ఇక్క‌డో ష‌ర‌తు విధించింది ప్ర‌భుత్వం. ఈ అయిదాట‌ల విధానాన్ని చిన్న సినిమాల‌కు మాత్ర‌మే ప‌రిమితం చేశారు. పైగా- దీన్ని రాష్ట్రవ్యాప్తంగా అమ‌లు చేస్తారా? లేక హైద‌రాబాద్ వ‌ర‌కేనా? అనేది ఇంకా స్ప‌ష్టంగా తేలాల్సి ఉంది. జీవో విడుద‌లైతేనే.. అన్ని వివ‌రాలు వెల్ల‌డ‌వుతాయి. రోజూ అయిదు ఆట‌ల‌ను ప్ర‌ద‌ర్శించేలా అనుమ‌తి ఇస్తామ‌ని తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు.

ఇబ్బందులు ఎదుర్కొంటున్న చిన్న చిత్రాల ఉనికిని కాపాడేందుకు ఈ నిర్ణ‌యాన్ని తీసుకున్న‌ట్లు చెప్పారు. దీనితోపాటు- హైదరాబాద్‌లో ఎంపిక చేసిన‌ ప్రధాన బస్టాండ్లలో మినీ థియేటర్లు నెల‌కొల్ప‌నున్న‌ట్లు చెప్పారు. అటు నంది అవార్డుల స్థానంలో సింహ అవార్డులు ఇస్తామ‌ని అన్నారు.

About the author

Related

JOIN THE DISCUSSION