రాందేవ్ బాబా గడ్డం పట్టుకుని మరీ లాగిన దలైలామా..!

ముంబైలో ఆగస్ట్ 13న నిర్వహించిన ప్రపంచ శాంతి, సామరస్య సమ్మేళన కార్య‌క్ర‌మంలో ఓ ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన దలైలామా రాందేవ్ బాబాను తన దగ్గరకు రమ్మన్నారు. ఆయన వచ్చిన వెంటనే దలైలామా రాందేవ్ బాబా గడ్డాన్ని పట్టుకొని లాగారు. పిలవగానే వచ్చిన బాబా దలైలామా కాళ్ళకు నమస్కరించాడు. అలా లేస్తున్న సమయంలో ఆయన గడ్డాన్ని పట్టుకొని అక్కడ ఉన్నవారిని నవ్వించే ప్రయత్నం చేశారు దలైలామా. ఆ తర్వాత ఆయన పొట్టపై సరదాగా తట్టడంతో.. రాందేవ్ తన పొట్టపై వున్న వస్త్రాలను తీసివేసి, ఉచ్ఛ్వాస నిశ్వాసలతో కూడిన ట్రేడ్ మార్క్ యోగా ఫీట్ ను చేసి చూపించారు. ఆ తర్వాత కూడా వారిద్దరూ నవ్వుతూ మాట్లాడుకుంటూ కనిపించారు.

ఈ కార్యక్రమంలో మౌలానా కల్బే సాదిక్, యూనియన్ మినిస్టర్లు డాక్టర్ హర్ష్ వర్ధన్, ధర్మేంద్ర ప్రధాన్ లు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా దలైలామా మాట్లాడుతూ ప్రపంచంలో అశాంతికి హింసావాదమే కారణమని అభిప్రాయపడ్డారు. భయం విసుగును పుట్టిస్తోంది. విసుగు వల్ల కోపం వస్తోంది. ఆ కోపం మనిషిని హింసవైపుకు నడిపిస్తోందన్నారు. ప్రజలంతా భయం లేకుండా జీవించాలని దలైలామా సూచించారు.

ఇక యోగా గురు బాబా రాందేవ్ కాస్త ఆవేశంగా మాట్లాడారు. చైనాకు శాంతి, సామరస్యం అంటే ఏమిటో తెలియదు, ఓకవేళ తెలిస్తే దలైలామా ఇండియాలో ఆశ్రయం పొందాల్సిన అవసరం ఏముంటందన్నారు. అందుకే ఇండియా, చైనాతో కుక్క కాటుకు చెప్పు దెబ్బ అన్నట్టుగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు.

 

About the author

Related

JOIN THE DISCUSSION