ఒకప్పుడు విరాట్ కోహ్లీకి ‘ఐ లవ్ యు’ చెప్పింది.. ఇప్పుడు స్పెలింగ్ తప్పు రాసింది..!

విరాట్ కోహ్లీకి లేడీస్ లో ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ప్రస్తుతం మన వాడు రిలేషన్ షిప్ లో ఉన్నాడు కాబట్టి ఎటువంటి రూమర్లు లేవు. అప్పట్లో కోహ్లీ దగ్గరకు ప్రేమ ప్రతిపాదనలు తెచ్చినవారు చాలామందే ఉన్నారు. తాను కోహ్లీని ప్రేమిస్తున్నానని ఇంగ్లాండ్ మహిళా క్రికెటర్ డానియెల్లే వ్యాట్ చెప్పింది. 2014లో ఐసీసీ టీ20 వరల్డ్ కప్ లో భాగంగా డానియెల్లే విరాట్ ను కలిసింది. అప్పుడు ప్రొపోజ్ కూడా చేసింది. అయితే విరాట్ కోహ్లీ ఆమె చేసిన ప్రతిపాదనను సున్నితంగా తిరస్కరించి.. ఆమెకు బహుమతిగా ఓ బ్యాట్ ను ఇచ్చాడు.

ఇప్పుడు చెప్పిందంతా ఫ్లాష్ బ్యాక్ అండీ.. అయితే మరోసారి డానియెల్లే విరాట్ విషయంలో వార్తల్లోకి ఎక్కింది. తాను ప్రాక్టీస్ మొదలుపెట్టానని.. కోహ్లీ ఇచ్చిన బ్యాట్ కు థాంక్స్ కూడా చెప్పింది. అంతా బాగానే ఉంది కానీ కోహ్లీ స్పెలింగ్ ను తప్పు రాసింది. దీంతో నెటిజన్లు ఆమెపై కామెంట్లు చేయడం మొదలుపెట్టారు. KOHLI కి బదులుగా ఆమె KHOLI తన బ్యాట్ మీద రాసుకుంది. కోలి అంటే అర్థం వేరమ్మా అంటూ విరాట్ ఫ్యాన్స్ చెబుతున్నారు. ఇంతకూ ఖోలి అంటే హిందీలో ‘పెద్ద గది’ అని అర్థం. ఇంకొందరు అయితే స్పెలింగ్స్ ముఖ్యం కాదు.. అక్కడ ఆమె ఫీలింగ్స్ ముఖ్యం అంటూ.. డానియెల్లేను వెనకేసుకొని వస్తున్నారు. ఇంతకు ముందు చేసిన ట్వీట్స్ లో కూడా ఆమె కోలి అనే రాసింది. అప్పుడు లేవని నోర్లు.. ఇప్పుడు ఎందుకు లేస్తున్నాయి.. యే..!

 

 

About the author

Related

JOIN THE DISCUSSION