స‌చివాల‌యంలో ముఖ్య‌మంత్రి కారునే దొంగిలించారు..!

చోరీ అంటే ఇదీ అని అనిపించే ఉదంతం. ధూమ్ టైప్‌లో చోటు చేసుకున్న దొంగ‌త‌నం ఇది. అత్యంత భ‌ద్ర‌త మ‌ధ్య ఉండే స‌చివాల‌యంలో ఏకంగా ముఖ్యమంత్రి కారునే ఎత్తుకెళ్లారు చోర‌శిఖామ‌ణులు. ఆ ఘ‌ట‌న చోటు చేసుకున్న‌ది ఢిల్లీ స‌చివాల‌యంలో. ఆ ముఖ్య‌మంత్రి అర‌వింద్ కేజ్రీవాల్‌.

ఆ కారు.. ఆయ‌న అమితంగా ఇష్ట‌ప‌డే నీలంరంగు వేగ‌న్ ఆర్‌. ఈ కారుతో కేజ్రీవాల్‌కు ప్రత్యేక అనుబంధం ఉంది. ఎందుకంటే- మొద‌ట్లో కేజ్రీవాల్ ఓ ఉద్య‌మ నేత అనే విష‌యం మ‌న‌కు తెలిసిందే. లోక్‌పాల్ బిల్లు కోసం ఆయ‌న అన్నా హ‌జారేతో క‌లిసి ఉద్య‌మించారు.

ఉద్య‌మ నేత‌గా ఉన్న‌ప్ప‌టి నుంచీ కేజ్రీవాల్ వేగ‌న్ ఆర్ కారును వాడుతున్నారు. ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌ల‌ను స్వీక‌రించిన త‌రువాత కూడా ఆయ‌న త‌న పాత వేగ‌న్ ఆర్ కారును వ‌ద‌ల్లేదు. అదే కారు ఇప్పుడు చోరీకి గురైంది. సీఎం కారు దొంగలను పట్టుకోవ‌డానికి ఢిల్లీ పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.

About the author

Related

JOIN THE DISCUSSION