కెప్టెన్సీకి గుడ్ బై చెప్పిన మహేంద్ర సింగ్ ధోని

కెప్టెన్సీకి గుడ్ బై చెప్పిన మహేంద్ర సింగ్ ధోని

కెప్టెన్సీకి గుడ్ బై చెప్పిన మహేంద్ర సింగ్ ధోని

భారత క్రికెటర్ మహేంద్రసింగ్ ధోనీ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. టీమ్ ఇండియా పరిమిత ఓవర్ల కెప్టెన్సీకి గుడ్ బై చెబుతున్నట్లు ఈ జార్ఖండ్ డైనమైట్ ప్రకటించాడు. ఇంగ్లాండ్‌ వన్డే, టి20 సిరీస్‌ మ్యాచ్‌లకు
అందుబాటులో ఉంటానని తెలిపారు. ఇప్పటికే టెస్ట్ కెప్టెన్సీ నుండి తప్పుకున్న మహేంద్రసింగ్ సింగ్ ధోని.. వన్డే, టీ 20 నాయకత్వానికి కూడా తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. ధోనీ నిర్ణయాన్ని బీసీసీఐ కూడా
ఆమోదించింది. జనవరిలో మొదలయ్యే ఇంగ్లాండ్ సిరీస్ కు విరాట్ కోహ్లీ నాయకత్వం వహించనున్నాడు. మూడు ఐసీసీ ట్రోఫీలు అందించిన భారత్ క్రికెట్ కెప్టెన్ గా ధోని కి పేరుంది. 2007 లో టీ20 ప్రపంచకప్,
2011లో వన్డే వరల్డ్ కప్, 2013లో ఛాంపియన్స్ ట్రోఫీ నెగ్గిన భారత జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించాడు. 2004 లో భారతజట్టు లోకి వచ్చిన ధోని.. 2007లో టీ20 కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టాడు. రాహుల్
ద్రావిడ్ కెప్టెన్ గా తప్పుకున్న తర్వాత వన్డే కెప్టెన్సీ, కుంబ్లే రిటైర్ అయ్యాక టెస్ట్ కెప్టెన్సీ దక్కింది. పూర్తి స్థాయి కెప్టెన్ గా మూడు ఫార్మాట్లలో ధోని భారత్ కు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించాడు. ధోని
ఇప్పటివరకూ 199 వన్డేల్లో, 72 టీట్వంటీలలో భారత్ కు కెప్టెన్ గా సేవలందించాడు. మూడు ఫార్మాట్లలో కలిపి రికార్డు స్థాయిలో మొత్తం 331 అంతర్జాతీయ మ్యాచ్ లకు ధోనీ కెప్టెన్ గా వ్యవహరించాడు. భారత
క్రికెట్ కు చేసిన సేవలకు ప్రతి ఒక్క క్రికెట్ అభిమాని తరుపున ధోనికి కృతఙ్ఞతలు తెలుపుతున్నట్లు బీసీసీఐ ప్రకటించింది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *