ఆ విషయంలో కోహ్లీ.. ధోనిని నమ్మకుంటే బాగుండేది..!

గౌహతి టీ20 మ్యాచ్ లో భారత్ ఓటమి చెందింది. అయితే ఓ విషయంలో మాత్రం కోహ్లీ ధోని సలహాను పాటించి బొక్క బోర్లా పడ్డాడు. 119 పరుగులను కాపాడుకునే క్రమంలో భారత్ మొదట్లోనే ఫించ్, వార్నర్ లను అవుట్ చేసింది. భువనేశ్వర్ కుమార్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. అద్భుతమైన అవుట్ స్వింగర్లతో ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ ను హడలెత్తించాడు. హెన్రిక్వేస్ ను తృటిలో అవుట్ చేసే ఛాన్స్ ను కోల్పోయాడు భువీ.

అయిదో ఓవర్ అయిదో బంతి భువనేశ్వర్ కుమార్ ఫుల్ లెంత్ బాల్.. ఆఫ్ స్టంప్ కు దగ్గరగా వేశాడు. అది కాస్తా హెన్రిక్వేస్ బ్యాట్ ను తాకి కీపర్ ధోని చేతిలోకి వెళ్ళింది. మొదట్లో క్యాచ్ కోసం అప్పీల్ చేసిన ధోని ఆ తర్వాత సైలెంట్ అయిపోయాడు. కానీ కోహ్లీ మాత్రం ఎంతో నమ్మకంగా అవుట్ సైడ్ ఎడ్జ్ అయి ఉంటుందని ధోనిని అడిగాడు. అయితే ధోని ఇక్కడ చిన్న తప్పు చేశాడు. అవుట్ కాదని కోహ్లీకి సర్ది చెప్పి.. డీఆర్ఎస్ తీసుకోకుండా చేశాడు.

తీరా డీఆర్ఎస్ లో చూడగా అతడి బ్యాట్ కు తగిలిందని స్పష్టంగా తెలుస్తోంది. ఒకవేళ థర్డ్ అంపైర్ దగ్గరకు వెళ్ళి ఉండి ఉంటే హెన్రిక్వేస్ తప్పకుండా అవుటయ్యేవాడు. భారత్ కు ఈ మ్యాచ్ లో మరింతగా గెలిచే అవకాశాలు వచ్చేవి. ఇక హెన్రిక్వేస్ నాలుగు సిక్సర్లు, నాలుగు ఫోర్లతో 62 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. భారత్ ఎనిమిది వికెట్ల తేడాతో మ్యాచ్ ను చేజార్చుకుంది.

About the author

Related

JOIN THE DISCUSSION