`బ్యూటిఫుల్ విమెన్ ఈజ్ మై మ‌ద‌ర్‌..ఆమె ప‌క్క‌న జోక‌ర్‌లా నేను..`

ఈ బ్లాక్ అండ్ వైట్ ఫొటోలో క‌నిపిస్తోన్న మ‌హిళ ఓ స్టార్ ద‌ర్శ‌కుడి త‌ల్లి. వివాదాలకు కేంద్రబిందువుగా పేరున్న ఆ ద‌ర్శ‌కుడు వేరెవ‌రో కాదు.. రామ్‌గోపాల్ వ‌ర్మ‌. చ‌దువుకునే రోజుల్లో త‌ల్లి సూర్య‌మ్మ‌తో క‌లిసి దిగిన ఫొటో అది. ఆ ఫొటోను రామ్‌గోపాల్ వ‌ర్మ గురువారం త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు.

`ద బ్యూటిఫుల్ విమెన్ ఈజ్ మై మ‌ద‌ర్‌..` అంటూ వ్యాఖ్యానించారు. ఆమె ప‌క్క‌న తాను ఓ జోక‌ర్‌లా ఉన్నాన‌ని చెప్పుకొచ్చారు. సాధార‌ణంగా త‌న వ్యక్తిగత విషయాలు, వివ‌రాల‌ను ఎప్పుడూ సోష‌ల్ మీడియాలో ప్ర‌స్తావించ‌లేదు ఆర్జీవీ. గ‌తంలో ఓ సారి మొదటిసారిగా తన కుమార్తెతో కలిసి దిగిన ఫొటోను పోస్ట్ చేశారంతే.

This beautiful woman is my mother and the joker looking nerdish guy standing next to her is me

A post shared by RGV (@rgvzoomin) on

ఆ త‌రువాత ఎప్పుడూ కుటుంబ స‌భ్యుల ప్ర‌స్తావ‌న‌ను తీసుకుని రాలేదు. తాజాగా చిన్నప్పుడు తన తల్లి సూర్యమ్మతో కలిసి దిగిన ఫొటోను ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేశారు. అందమైన మహిళ మా అమ్మ. పక్కన జోకర్‌లా కనిపిస్తున్నది నేనే’అని వర్మ క్యాప్షన్‌లో పేర్కొన్నారు. ప్ర‌స్తుతం రామ్‌గోపాల్ వ‌ర్మ బాలీవుడ్ ఓ మూవీని తెర‌కెక్కిస్తున్నారు. ఆ సినిమా పేరు `అరెస్ట్‌`. అభిషేక్ బ‌చ్చ‌న్ ఇందులో హీరో.

About the author

Related

JOIN THE DISCUSSION