‘దిశా’ ఎంత అందంగా ఉన్నావో..!

దిశాపటానీ.. తెలుగులో లోఫర్, బాలీవుడ్ లో ఎమ్మెస్ ధోనీ, హాలీవుడ్ లో కుంగ్ ఫూ యోగా అంటూ వరుసగా చిత్రాలు చేసేసింది. టాలీవుడ్ నుండి హాలీవుడ్ దాకా అంత తొందరగా ఎదిగిన హీరోయిన్ ఎవరంటే దిశానే అంటారు. ఇక సోషల్ మీడియాలో దిశా పటానీ ఫాలోవర్ల సంఖ్య మామూలుగా లేదు. తన క్యూట్ నెస్ తో కుర్రాళ్ళ మతులు పోగోడుతోంది. అందుకే ఆమెకు ‘నేషనల్ క్రష్ ఆఫ్ ఇండియా’ అంటూ బిరుదు కూడా ఇచ్చేశారు. మొన్న ఐపీఎల్ ఓపెనింగ్ సెరమనీ రోజున దిశా డ్యాన్స్ కు అందరూ ఫిదా అయిపోయారు.

ఆమె గురించి కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలని ఎందరికో ఉంటుంది. ఫెమినా మిస్ ఇండియా ఫస్ట్ రన్నరప్ అయిన దిశాను మన పూరీ జగన్నాథ్ వెండితెరపై కనబడేలా చేశాడు. సినిమాల్లోకి రాకముందు ఆమె ఓ మోడల్.. ఎన్నో అడ్వర్టైజ్మెంట్లకు పని చేసింది. అయితే దిశా కొత్తగా మోడలింగ్ లో ప్రవేశించినప్పుడు ఓ ఫోటో షూట్ లో పాల్గొంది. ఆ ఫోటో షూట్ ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా బయటకు రావడంతో దిశా అప్పటికీ ఇప్పటికీ ఎంతగా మారిపోయిందో అని ఆమె అభిమానులు తెగ ఆనందపడిపోతున్నారు.

About the author

Related

JOIN THE DISCUSSION