అక్కడి డ్రగ్ గ్యాంగ్ తో పెట్టుకుంటే ఇదే గతి.. తలలను తీసేసి టోపీలను పెట్టారు..!

డ్రగ్స్.. ప్రపంచదేశాలను వణికిస్తోంది. ఎందరో వీటిని తీసుకుంటూ నాశనమవుతుంటే.. మరికొందరు ఈ డ్రగ్స్ డీలర్స్ చేతికి చిక్కి ప్రాణాలు కోల్పోతున్నారు. మెక్సికోలో ఈ డ్రగ్స్ డీలర్స్ ప్రభావం అంతా ఇంతా కాదు..! తాజాగా రోడ్డు మీద చెత్తకుప్పలో ముగ్గురి మృతదేహాలు పోలీసులకు దొరికాయి. వారి తలలను తీసేసి ఆ స్థానంలో టోపీలను పెట్టారు.

చనిపోయిన వారిని జువాన్ సాల్వడోర్ పాటినో లియాన్, జార్జి లూయిస్ లుగా గుర్తించారు. వీరిద్దరూ అన్నదమ్ములు. అలాగే 28 సంవత్సరాల డెనిస్సే మృతదేహాన్ని కూడా జలాపా సిటీలో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీరి చావుకు గల ప్రధాన కారణం డ్రగ్స్ డీలర్స్ తో గల వైరమేనని పోలీసులు చెబుతున్నారు. అక్కడి డ్రగ్స్ డీలర్స్ ను ఎదిరించిన వారికి ఇలాంటి చావులే ఉంటాయి. ఇది డ్రగ్స్ డీలర్స్ మాత్రమే చేశారని తెలియజేసే మర్డర్లు అని పలువురు అభిప్రాయపడ్డారు. సెప్టెంబర్ 12 న వీరు తప్పి పోయినట్లు పోలీసులకు సమాచారం అందింది. పార్టీ చేసుకోడానికి వెళ్ళిన వీరు ఆ తర్వాత తిరిగి రాలేదు. వారి బాడీలను పూర్తిగా ప్యాక్ చేసి వాటి మీద మెక్సికన్ టోపీలను పెట్టారు. ఇది నార్త్-క్యాలిఫోర్నియన్ గ్యాంగ్ యొక్క ట్రేడ్ మార్క్ హత్య అట.. వారితో పెట్టుకుంటే చావులు ఎంత దారుణంగా ఉంటాయో ఇవి తెలియజేస్తాయి.

About the author

Related

JOIN THE DISCUSSION