50సంవత్సరాల క్రితం దుబాయ్.. దుబాయ్ షేక్ లు ఎలా ఉండేవారో తెలుసా..?

దుబాయ్.. ప్రపంచంలోని ధనిక నగరాల్లో ఒకటి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో అత్యధిక జనాభా కలిగిన నగరం. ఎందరు వెళ్ళినా ఉద్యోగాలు ఇవ్వగల మహా నగరం. ఆకాశాన్ని తాకే భవనాలు.. అత్యంత సుందరంగా ఉండే మసీదులు.. ఇలా ఎన్నో దుబాయ్ లో ఉన్నాయి. ఒక్కసారైనా తమ జీవితంలో దుబాయ్ ని చూడాలని అనుకుంటూ ఉంటారు. అయితే ఇదంతా ఇప్పటి ప్రాభావమే.. ఒకప్పుడు దుబాయ్ చాలా వెనుకబడి ఉండేది.. కానీ రాను రాను ఆ దేశంలో అభివృద్ధి కనిపిస్తూ వచ్చింది. కొన్ని సంవత్సరాలలో ఆ దేశం రూపు రేఖలు మారిపోయాయి.

1960 వరకూ అక్కడి వాళ్లకు ఆయిల్ బిజినెస్ అంటేనే తెలీదు. 1966లో ఎప్పుడైతే అక్కడ ఆయిల్ ఉండడాన్ని కనుగొన్నారో.. దుబాయ్ అభివృద్ధిని అడ్డుకోవడం ఎవరితరం కాలేదు. విదేశాలకు ఆయిల్ అమ్ముతుంటే షేక్ లకు విచ్చలవిడిగా డబ్బులు రావడం మొదలైంది. ఆ తర్వాత పలు దేశాల ప్రజలను దుబాయ్ ఆకర్షించింది. డబ్బులు సంపాదించాలి అని అనుకున్నవారు అక్కడికి చేరుకుంటున్నారు. కొన్ని సంవత్సరాల పాటు అక్కడే ఉండి.. తమ కుటుంబ అవసరాలను తీరుస్తున్నారు.

1970 లలో దుబాయ్ ఎలా ఉండేదో ఈ ఫోటోలను చూస్తే తెలిసిపోతుంది…

జుమేరా బీచ్ రోడ్ లో ఆయిల్ డ్రమ్ములను ఓ వ్యక్తి గాడిద ద్వారా తీసుకొని వెళుతున్నాడు.

ఓల్డ్ షేక్ జయాద్ రోడ్డు

1970లో దుబాయ్ ఎయిర్ పోర్ట్

1964లో దియేరా క్లాక్ టవర్

జుమేరా మసీదు కడుతున్న సమయంలో

ఇక్కడ మనుషులు కూర్చున్న ప్రాంతం పేరు అల్-నైఫ్ సోక్.. 2008 లో మంటలు వ్యాపించి ఈ ప్రాంతం పూర్తిగా నాశనం అయింది. 2010లో షేక్ లు అందరూ కలుసుకొని దీన్ని పునర్మించారు.

ఒకప్పటి దుబాయ్ మార్కెట్..

 

About the author

Related

JOIN THE DISCUSSION