నీ సినిమా కోరిక తీర్చేందుకే.. అంటూ ఇంజనీరింగ్ అమ్మాయితో హైదరాబాద్ లో పాడు పనులు..!

సినిమాల్లో రాణించాలని.. తమ ట్యాలెంట్ ఏంటో ప్రపంచానికి తెలియజేయాలని ఎందఱో ప్రతిరోజూ కృష్ణానగర్ లో వాలుతుంటారు. చాలా మంది డక్కాముక్కీలు తిని ఎదిగినవారు ఉంటే.. అంతకంటే ఎక్కువ మంది మోసపోయిన వాళ్ళు ఉన్నారు. సినిమా ఛాన్స్ లు సంపాదించడం కోసం డబ్బులు కట్టి మోసపోయిన వ్యక్తులు ఎందరో.. అంతెందుకు బర్నింగ్ స్టార్ సంపూ కూడా అలా మోసపోయిన రకమే.. ఇక అమ్మాయిల గురించి చెప్పాల్సిన అవసరం లేదు. కొందరు కామాంధుల బారిన పడి జీవితాలను నాశనం చేసుకున్నారు. నిన్ను స్టార్ చేస్తా కాజల్ తర్వాత నువ్వే స్టార్ హీరోయిన్ అంటూ ఎందరో అమ్మాయిలను మోసం చేసిన వాళ్ళు చాలామందే ఉన్నారు. తాజాగా సినిమా హీరోయిన్ అవుదామని హైదరాబాద్ వచ్చిన ఓ అమ్మాయిని వ్యభిచారిణిగా మార్చిన ఘటన కృష్ణానగర్ లో జరుగుతున్న మోసాలలో ఒకటి.

 

యూసుఫ్‌ గూడ సమీపంలోని ఎల్‌ఎన్‌ నగర్‌ లో నాగభాస్కర్‌ కొంత కాలంగా వ్యభిచార గృహాన్ని నిర్వహిస్తున్నాడు. అందమైన యువతుల అలవాట్లు, అవసరాలను ఆసరగా చేసుకుని వారిని ముగ్గులోకి లాగడం అతని అసిస్టెంట్లు అయిన సాయి దుర్గా ప్రసాద్, ధర్మ ల పని. అలాంటి వారికి బీటెక్ ఫైనల్ ఇయర్ చదివే ఓ అమ్మాయి పరిచయం అయింది. మేకప్, దుస్తులు, ఫోటో షూట్ ఖర్చుల కోసం డబ్బులు ఇస్తామని నమ్మించారు.. అయితే నువ్వు చేయాల్సింది విటులతో గడపడమేనని చెప్పారు. సినిమా పిచ్చిలో ఉన్న ఆ యువతి వారికి ఓకే చెప్పింది. ఆమె ఫోటోలను యువకులకు పంపారు.

 

కొద్ది రోజుల పాటు ఆమెతో దందా నిర్వహించారు. ఇంకా ఎన్ని రోజులు ఈ పనులు అని ఆమె అడిగినప్పుడల్లా ఏదో ఒకటి చెప్పి ఆమె నోరు మూయించే వారు. చివరికి ఆమె విషయం పోలీసుల దాకా వెళ్ళింది. తాజాగా ఆమెను విటులతో గడుపుతున్న సమయంలో పట్టుకున్నారు. ఆమెతో పాటు ముంబై అమ్మాయిని కూడా అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు. నాగభాస్కర్‌ పరారీలో ఉండగా, కార్తీక్, ధర్మను అరెస్టు చేశారు. ఇది బయటపడ్డ ఒక్క సంఘటన మాత్రమే.. ఇలాంటివి కృష్ణా నగర్ లో ప్రతి రోజూ జరుగుతూనే ఉన్నాయి.

 

About the author

Related

JOIN THE DISCUSSION