బెన్‌స్టోక్స్ అరెస్ట్

ఇంగ్లండ్ క్రికెట‌ర్‌, ఆల్‌రౌండ‌ర్ బెన్‌స్టోక్స్ అరెస్ట‌య్యాడు. అత‌నితోపాటు మ‌రో బ్యాట్స్‌మెన్ అలెక్స్ హేల్స్‌ను కూడా ఆ దేశ పోలీసులు వేర్వేరుగా అరెస్టు చేశారు. ఓ వ్య‌క్తిని కొట్టిన ఘ‌ట‌న‌లో వారిద్ద‌రూ అరెస్ట‌యిన‌ట్టు తెలుస్తోంది. దీనితో వెస్టిండీస్‌తో జ‌రిగే నాలుగో వ‌న్డే మ్యాచ్‌కు వారిద్ద‌రూ దూర‌మ‌ని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు వెల్ల‌డించింది.

బ్రిస్ట‌ల్ డిస్ట్రిక్ట్‌లోని క్లిఫ్‌ట‌న్ ప్రాంతంలో వారిద్ద‌రినీ అరెస్ట్ చేసిన‌ట్టు ఈసీబీ డైరెక్ట‌ర్ ఆండ్రూ స్ట్రాస్ ప్ర‌క‌టించారు. వారిద్ద‌రూ నాలుగో వ‌న్డేలో ఆడ‌బోర‌ని స్ట్రాస్ వెల్ల‌డించారు. ఓ వ్య‌క్తిని కొట్టిన ఘ‌ట‌న‌లో అరెస్ట‌య్యార‌ని చెప్పారు.  ఇద్ద‌రి స్థానంలో జ‌ట్టులో ఎవ‌రిని తీసుకునేదీ ఇంకా వెల్ల‌డి కాలేదు. బోర్డుతో చ‌ర్చించిన త‌రువాతే నిర్ణ‌యం తీసుకుంటామ‌ని అన్నారు.

About the author

Related

JOIN THE DISCUSSION