కాటేస్తుంది..మాయ‌మౌతుంది: ఆ ఊరికి నాగ శాపం ఉంద‌ట‌!

క‌ర్ణాట‌క‌లోని ఓ కుగ్రామం. గోవా, మ‌హారాష్ట్ర స‌రిహ‌ద్దుల్లోని బెళ‌గావి జిల్లాలో ఉండే ఆ ఊరి పేరు హొస‌కోటె. బైల‌హొంగ‌ల తాలూకాలో ఉండే ఆ ఊరిలో అయిదువేల మంది నివ‌సిస్తున్నారు. వారిలో ఎక్కువ మంది వ్య‌వ‌సాయ కూలీలు. ఆ ఊరి ప్ర‌జల‌కు కంటిమీద కునుకు లేదు చీక‌టి ప‌డితే భ‌యం. నిద్ర పోవాలంటే అంత‌కంటే భ‌యం. కార‌ణం? నాగుపాములు. ఎక్క‌డి నుంచి వ‌స్తుందో తెలియ‌దు.. ఎలా వ‌స్తుందో తెలియ‌దు. కాటేస్తుంది.

 

ఛ‌టుక్కున మాయమ‌వుతుంది. ఎంత వెదికినా కనిపించ‌ద‌ట‌. పాముకాట్ల‌కు ఈ మూడు నెల‌ల కాలంలో అయిదుమంది చ‌నిపోయారు. 17 మందికి పైగా చావుబ‌తుకుల్లో ఉన్నారు. బుధ‌వారం రాత్రి కూడా ఇద్ద‌రు వ్య‌క్తులు పాముకాటుకు గుర‌య్యారు. వారి ఆరోగ్య ప‌రిస్థితి ఆందోళ‌న‌క‌ర‌మేన‌ని డాక్ట‌ర్లు చెబుతున్నారు.

నాగుపాములు ప‌గ‌బ‌ట్టాయ‌ని చెబుతున్నారు ఆ ఊరి ప్ర‌జ‌లు. నాగుల చ‌వితి త‌రువాత ఈ ప‌రిస్థితి తీవ్రంగా మారింద‌నీ అంటున్నారు. ప్ర‌తి రోజూ ఎవ‌రో ఒక‌రు.. పాముకాటుకు గుర‌వుతూనే ఉన్నారు. దీనితో నిద్రాహారాలు మానేసి.. కాప‌లా ఉంటున్నారు. ఊరిలో ఉండే శివాల‌యాల‌కు పూజ‌లు చేస్తున్నారు.

నాగదేవ‌త విగ్ర‌హాల‌ను ప్ర‌తిష్ఠిస్తున్నారు. ప్ర‌తి ఇంటి ముందూ నాగుపాము బొమ్మ‌ల‌ను వేసి పూజిస్తున్నారు. చాలామంది త‌మ ఇళ్ల‌ను వ‌దిలి వెళ్లిపోయారు కూడా. అయిన‌ప్ప‌టికీ- పాముకాట్లు త‌ప్ప‌ట్లేదు. ఈ మూడు నెల‌ల కాలంలో పాము కాటు నుంచి త‌ప్పించుకున్న వారిని వేళ్ల‌మీద లెక్క‌పెట్టొచ్చు.

ఇంత‌కీ- ఏం జ‌రుగుతోందా ఊరిలో? ఆ ఊరి ప్ర‌జ‌లు చెబుతున్న‌ట్లు నిజంగా నాగ‌దేవ‌త శాపం వారిని వెంటాడుతోందా? లేక మాస్ హిస్టీరియానా? పోలీసులు, రెవెన్యూ అధికారుల‌కు ఫిర్యాదు చేస్తే.. వారేమో ప‌ట్టించుకోవ‌ట్లేదు. అదంతా మూఢ‌న‌మ్మ‌కం కొట్టి పారేస్తున్నారు.

ఇదే అద‌నుగా కొంద‌రు మంత్రగాళ్లు కూడా త‌యార‌య్యారు. ఆ ఊరి ప్ర‌జ‌లను మ‌రింత భ‌యాందోళ‌న‌కు గురి చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. తాయ‌త్తు క‌డ‌తామంటూ పుట్టుకొస్తున్నారు. త‌మ తాయ‌త్తును ధ‌రిస్తే.. పాములు ద‌రికి రావ‌ని భ‌రోసా ఇస్తున్నారు. ఇలా తాయ‌త్తు క‌ట్టుకున్న వారు కూడా పాముకాటుకు గుర‌య్యార‌ట‌.

 

About the author

Related

JOIN THE DISCUSSION